ప్రభాస్ తర్వాత మూవీ ఏంటీ.. సమాధానం లేని ప్రశ్న

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధేశ్యామ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా నిరాశ పర్చడంతో అభిమానులు దర్శకుడు రాధాకృష్ణ పై చాలా ఆగ్రహం ను వ్యక్తం చేయడం జరిగింది.

 Prabhas Salaar Aadipurush Movies Witch One Is Coming First Prabhas, Salar , Aad-TeluguStop.com

ప్రభాస్‌ ను ఉపయోగించుకుని అద్బుతంను ఆవిష్కరించే అవకాశం ఉన్నా కూడా ఎందుకు అత్యంత చెత్త సినిమా తీశారు అంటూ విమర్శలు చేసే వారు చాలా మంది ఉన్నారు.ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా నిరాశ పర్చడంతో పాటు అంతకు ముందు వచ్చిన సాహో సినిమా కూడా పెద్దగా ఆడిందే లేదు.

బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ సక్సెస్‌ అందుకోలేదు.కనుక తదుపరి సినిమా విషయం లో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమా లు ఉన్నాయి.అందులో ఆదిపురుష్‌ షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ నడుస్తున్నాయి.

మరో వైపు ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ రూపొందుతోంది.

సలార్‌ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యిందని.త్వరలోనే సినిమా షూటింగ్‌ ను ముగిస్తామని అంటున్నారు.

ఈ రెండు సినిమా లు సెట్స్ పై ఉండగానే దర్శకుడు మారుతి రాజా డీలక్స్ ను ప్రారంభించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.చాలా తక్కువ సమయంలోనే రాజా డీలక్స్ సినిమా ని విడుదల చేస్తారని అంటున్నారు.

కనుక ప్రభాస్ నుండి రాబోతున్న తదుపరి సినిమా ఈ మూడింటి లో ఏది అనే విషయమై ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వ లేక పోతున్నారు.ప్రతి సినిమా కూడా భారీ అంచనాలను కలిగి ఉన్నది.

కనుక ఖచ్చితంగా రాధేశ్యామ్‌ సినిమా ప్లాప్ ను మర్చి పోయే విధంగా ఒక మంచి సినిమా ప్రభాస్ నుండి వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.అందుకే ప్రభాస్ తదుపరి సినిమా ఏంటీ అంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube