బాహుబలి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.డార్లింగ్ అంటూ పలువురు విషెస్‌తో ముంచెత్తుతున్నారు.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి 16 సంవత్సరాలు.చేసినవి 18 సినిమాలు.
అందులో విజయాలు ఉన్నాయ్.అంతకు మించి అపజయాలు ఉన్నాయి.
హిట్టొస్తే కాలర్ ఎగరేయడు.ఫ్లాప్ వచ్చింది కదా అని కుంగిపోడు.

ముఖ్యంగా ప్రభాస్ గురించి చెప్పుకోవాలంటే కమిట్మెంట్.బాహుబలి సినిమానే దీనికి నిదర్శనం.అందుకే అతడు దర్శకులకు ఇష్టమైన డార్లింగ్, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే మిస్టర్ పర్ఫెక్ట్.


అమ్మాయిల మనసుదోచి వర్షంలో డ్యూయెట్లు పాడాలన్నా.నరసింహుడి అవతారంలో శత్రువుల తాటతీసే ఛత్రపతి కావాలన్నా.అమ్మ ప్రేమ కోసం పరితపించి సెంటిమెంట్ పండించి ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించే యోగిగా మారాలన్నా.
కుటుంబ బంధాలను గుర్తు చేసే మిస్టర్ పర్ఫెక్ట్ కావాలన్నా.స్టైలిష్ లుక్‌తో బిల్లాగా మెరిపించాలన్నా.
బాహుబలిగా చరిత్రపుటల్లోకెక్కాలన్నా ఒన్ అండ్ ఓన్లీ డార్లింగ్ ప్రభాస్‌కే చెల్లింది.ఎన్ని సినిమాలు చేశాం అన్నది ముఖ్యం కాదు జనం ఎంతలా గుర్తు పెట్టుకునే పాత్ర చేశాం అన్నదే ముఖ్యమని.
ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు.ఇన్ని క్వాలిటీస్ ఉండటం వల్లే నేషనల్ స్టార్‌గా మారారు రెబర్ స్టార్ ప్రభాస్.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో.ఇది వరకే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది…కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు.అయితే ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఈ రోజు ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు ప్రభాస్ గత వారం ట్వీట్ చేసారు.

2002లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు అనతికాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు.16 ఏళ్లలో 18 సినిమాల్లో నటించిన ప్రభాస్ కెరీర్లో విజయాలతో పాటు పరాజయాలు ఉన్నాయి.ఆయన నటించిన సినిమాలు.

1.ఈశ్వర్

2.రాఘవేంద్ర

3.వర్షం (బ్లాక్ బస్టర్ హిట్)

4.అడవిరాముడు

5.చక్రం

6.ఛత్రపతి (బ్లాక్ బస్టర్ హిట్)

7.పౌర్ణమి

8.యోగి

9.మున్నా

10.బుజ్జిగాడు

11.బిల్లా

12.ఏక్ నిరంజన్

13.డార్లింగ్

14.మిస్టర్ పర్ ఫెక్ట్ (బ్లాక్ బస్టర్ హిట్)

15.రెబల్

16.మిర్చి (బ్లాక్ బస్టర్ హిట్)

17.బాహుబలి ది బిగినింగ్ (బ్లాక్ బస్టర్ హిట్)

18.బాహుబలి ది కన్ క్లూజన్ (బ్లాక్ బస్టర్ హిట్)

19.సాహో (షూటింగ్ దశలో ఉంది)

39 వ ఏటలోకి అడుగుపెట్టిన ప్రభాస్‌కి ఇంకాపెళ్లి కాలేదు.చాన్నాళ్ల నుంచి ఆయన కుటుంబీకులు.పిల్లను వెతికే పనిలోనే ఉన్నారు.
అన్నింటిలోనూ తన అభిమానులతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న ప్రభాస్.తన పెళ్లి విషయంలో వాయిదాలు వేస్తున్నారు.
మరి ఈ ఏడాదైనా డార్లింగ్‌కి మంచి పిల్ల దొరికి పప్పన్నం పెట్టాలని కోరుకుందాం.అన్నిట్లో పర్ఫెక్ట్ అయిన ప్రభాస్ పెళ్లి కూడా చేసేసుకుంటే పక్క మిస్టర్ పర్ఫెక్ట్ అనేయొచ్చు అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
ఈలోపు ప్రభాస్ కి సంబందించిన ఈ అరుదైన ఫోటోలు ఓ లుక్ వేయండి.!
