ఎనిమిది కొత్త కార్లను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. ఖరీదెంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయలుగా ఉంది.

 Power Star Pawan Kalyan Bought 8 New Cars Details Here Goes Viral , 8 New Cars,-TeluguStop.com

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎనిమిది కొత్త కార్లు కొనుగోలు చేశారు.ఈ కొత్త కార్ల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

ఒక్కో కారు విలువ దాదాపుగా 19 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.జనసేన పార్టీ కోసం పవన్ ఈ కార్లను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది.

పవన్ త్వరలో ఏపీ అంతటా పర్యటించనున్నారని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది.ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను 2023 సంవత్సరం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా పవన్ ను సీఎం చేస్తామనే షరతుకు ఓకే చెబితే మాత్రమే పవన్ టీడీపీకి సపోర్ట్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని తిరుపతిలో పోటీ చేస్తే పవన్ కు అనుకూల ఫలితాలు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Cars, Pawan Kalyan-Movie

పవన్ హరిహర వీరమల్లును పూర్తి చేసి తర్వాత సినిమాలను మొదలుపెడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో పవన్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గబ్బర్ సింగ్ తో పవన్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమాతో అంతకు మించిన సక్సెస్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube