లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమాను పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రెండు భాగాలుగా మణిరత్నం సినిమాని తీర్చిదిద్దారు.
ఇప్పటికే పొన్నియన్ సెల్వన్1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ ఆన్ ఇండియా స్థాయిలో పలు భాషలలో విడుదలైంది.
ఇలా ఈ సినిమా వివిధ భాషలలో మంచి ఆదరణ సంపాదించుకోగా తమిళంలో మాత్రం అద్భుతమైన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి కార్తీ వంటి హీరోలతో పాటు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం నటించారు.
ఇలా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ భాగంపై అంచనాలు పెరిగిపోయాయి.ఈ క్రమంలోనే రెండవ భాగం గురించి తాజాగా ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2గురించి గతంలోనే మణిరత్నం వెల్లడించారు.మొదటి భాగం విడుదలైన ఆరు నెలలకు రెండవ భాగం విడుదలవుతుందంటూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలిపారు.

ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా ఈ సినిమాని వేసవి సెలవుల్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు సమాచారం.ఇదే విషయాన్ని మణిరత్నం మొదటి భాగం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో.షూటింగ్ పనులు అన్నింటికి పోటీ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈ క్రమంలోనే ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదలకు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలవడ నుంది.