కర్ణాటకలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..!!

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ( Karnataka Assembly Elections )సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.కొన్నిచోట్ల చదరన్ ముదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.

 Polling For Assembly Elections In Karnataka Has Ended , Karnataka Assembly Elec-TeluguStop.com

గెలుపు పై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ( BJP ) ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ లో 66% పోలింగ్ నమోదు అయింది.సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడం జరిగింది.2018 ఎన్నికల్లో 72% పోలింగ్ నమోదు కాగా… సాయంత్రం 6 గంటలకు చేరే సరికి పోలింగ్ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈనెల 13న వెలువడనున్నాయి.

అన్ని చాట్ల ప్రశాంతంగా ముగిసిన కానీ కొన్నిచోట్ల విధ్వంస సంఘటనలు చోటుచేసుకున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో( Karnataka ) ప్రధాన పార్టీలు గెలుపు కోసం తీవ్రస్థాయిలో కృషి చేశాయి.బీజేపీ నాయకులు అయితే అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం దాదాపు రెండు వారాలు పాటు జాతీయస్థాయి నేతలు కర్ణాటకలోనే ఉన్నారు.

ప్రధాని మోడీ ఎన్నడూ లేని రీతిలో…ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కువ రోడ్డు షోలలో… బహిరంగ సభలలో పాల్గొనడం జరిగింది.అయితే ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే ఈసారి కర్ణాటకలో అధికారం మారే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాలు లెక్కలు బయటపడుతున్నాయి.

మరి 13వ తారీకు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube