సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajanikanth ) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.జైలర్ సినిమాతో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
అయితే రజనీకాంత్ కూతుళ్లకు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.అయితే రజనీకాంత్ కూతురు సౌందర్య తాజాగా పోలీసులను ఆశ్రయించారు.
తన దగ్గర ఉన్న ఖరీదైన రేంజ్ రోవర్ కారు తాళాలు మిస్ అయ్యాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఒక ప్రైవేట్ కాలేజ్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సమయంలో కారు తాళాలను మిస్ చేసుకున్నారు.
చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్ లో సౌందర్య( Soundarya ) పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.సిటీ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు గురించి వెల్లడించారు.

కొన్ని వారాల క్రితం ఐశ్వర్య రజనీకాంత్( Aishwarya Rajinikanth ) ఇంట్లో వజ్రాలు, బంగారు ఆభరణాలు పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంట్లో పని చేసేవాళ్లు ఆ దొంగతనానికి పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది.సౌందర్య కారు తాళాలను పోగొట్టుకున్నారని తెలిసిన నెటిజన్లు అక్కాచెల్లెళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటారని కామెంట్లు చేయడం గమనార్హం.

రజనీకాంత్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా ఆయన కూతుళ్లు మాత్రం కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.రజనీకాంత్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని యంగ్ జనరేషన్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రజనీకాంత్ రెమ్యునరేషన్ 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.సినిమా సినిమాకు రజనీకాంత్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.







