ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన పోకూరి బాబూరావు( Pokuri Baburao ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈతరం ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ద్వారా పోకూరి బాబూరావు మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
పోకూరి బాబూరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అనే సినిమా తీసిన తర్వాత పరుచూరి బ్రదర్స్ ( Paruchuri Brothers )దగ్గరకు నేనే వెళ్లే పరిస్థితి ఉండేదని ఆయన తెలిపారు.
ఆ సమయంలో మరుధూరి రాజా( Marudhuri Raja ) ఒక లైన్ చెప్పగా ఆ లైన్ నాకు ఎంతగానో నచ్చిందని పోకూరి బాబూరావు పేర్కొన్నారు.
ఆ లైన్ హరనాథరావుకు చెప్పగా ఆయనకు నచ్చలేదని ముత్యాల సుబ్బయ్య ( Mutyala Subbaiah )మాత్రం ఈ స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తే బాగుంటుందని అన్నారని పరుచూరి బ్రదర్స్ మాత్రం స్క్రిప్ట్ చాలా డ్రైగా ఉందని అన్నారని పోకూరి బాబూరావు కామెంట్లు చేశారు.పరుచూరి బ్రదర్స్ కొన్ని మార్పులు సూచించారని ఆయన తెలిపారు.
అన్న సినిమా కమర్షియల్ హిట్ అని పోకూరి బాబూరావు పేర్కొన్నారు.అన్న సినిమా కోసం బాలకృష్ణను( Balakrishna ) అనుకున్నాం కానీ ఆయన వరకు ఈ కథ వెళ్లలేదని ఆ సినిమాలో బాలయ్య నటించి ఉంటే ఇంకా బాగుండేదని పోకూరి బాబూరావు చెప్పుకొచ్చారు.రాజశేఖర్ ( Rajasekhar )తో చాలా సినిమాలు చేశామని అయితే మొదట రాజశేఖర్ సినిమాలకు పనికిరాడని తిట్టడం జరిగిందని పోకూరి బాబూరావు చెప్పుకొచ్చారు.
సినిమాలకు పనికిరాడని రాజశేఖర్ ను తిట్టిన నేనే ఆయనతో వరుసగా సినిమాలు తీశానని పోకూరి బాబూరావు కామెంట్లు చేశారు.రాజశేఖర్ తో బాగా ఫ్రెండ్ షిప్ ఉండేదని చిన్నచిన్న మనస్పర్ధలు కామన్ అని పోకూరి బాబూరావు వెల్లడించారు.పోకూరి బాబూరావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజశేఖర్ ప్రస్తుతం సినిమాలలో ఎక్కువగా నటించడం లేదనే సంగతి తెలిసిందే.