దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు విక్రమ్(Vikram) గురించి అందరికీ తెలిసిందే.విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటారు.57 సంవత్సరాల వయసులో కూడా ఈయన యంగ్ హీరో గా కనబడుతూ యంగ్ హీరోలకు భారీ స్థాయిలో పోటీగా నిలుస్తున్నారని చెప్పాలి.తాజాగా విక్రమ్ మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో నటించిన పొన్నియన్ సెల్వన్ 2సినిమా (Ponniyin Selvan 2 Movie) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విక్రమ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు గతంలో జరిగిన ప్రమాదం(Accident) గురించి తెలియజేశారు.ఇదివరకే ఈ ప్రమాదం గురించి పలసార్లు ప్రస్తావించిన విక్రమ్ తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరించారు.తనకు 12 సంవత్సరాల వయసులోనే నటన అంటే ఎంతో ఆసక్తి ఉండేదని తెలిపారు.ఈ క్రమంలోనే ఒక సినిమాలు తనకు మూగ అబ్బాయి పాత్రలో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమాలో నటించినందుకు విక్రమ్ కు ఐఐటి మద్రాసులో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నారు.
ఈ అవార్డు కార్యక్రమానికి తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో తన కాలు మొత్తం బాగా డామేజ్ అయిందని తన కుడికాలు తీసేయాలని డాక్టర్లు చెప్పినప్పటికీ తన తల్లి అందుకు ఒప్పుకోలేదని విక్రమ్ తెలిపారు.ఇలా తాను కోలుకోవడానికి సుమారు నాలుగు సంవత్సరాల సమయం పట్టిందని అయితే ఆ సమయంలో తన కాలికి 23 సర్జరీలు జరిగాయి అంటూ ఈ సందర్భంగా విక్రమ్ తన ప్రమాదం గురించి తెలియజేశారు.ఈ విధంగా తనకు ప్రమాదం జరిగినప్పటికీ నటనపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని, తాను పూర్తిగా కోల్పోవడానికి నాలుగు సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు.
ఇక హీరోగా 1990లో ఎన్ కాదల్ కన్మణి సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టానని అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని విక్రమ్ తెలియజేశారు.