కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ‘కాంగ్రెస్ పార్టీదే హవా’ అని పీపుల్స్ పల్స్ సంస్థ – సౌత్‌ఫస్ట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 107-119, బిజెపికి 78-90, జేడీ(ఎస్)కు 23-29, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతం.కర్ణాటకలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 113 సీట్లు గెలవాలి – పీపుల్స్‌పల్స్ పీపుల్స్‌పల్స్ సంస్థ ( Peoples Pulse ) నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్-బిజెపి మధ్య ఓట్ల వ్యత్యాసం 6 శాతం ఉండే అవకాశం ఉంది.
పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 42 శాతం, బిజెపికి 36 శాతం, జేడీ(ఎస్)కు 16 శాతం అవకాశం ఉంది.మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతం.2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 శాతం ఓట్లను అధికంగా పొందుతుండగా, బిజెపి 0.35 శాతం, జేడీ(ఎస్) 2.3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
ముఖ్యమంత్రిగా ఎవరుండాలని అడిగితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ( Siddaramaiah )అని 42 శాతం మంది, ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అని 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అని 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్ప అని 14 శాతం మంది, డి.కె.శివకుమార్ అని 3 శాతం మంది కోరుకుంటున్నారు – పీపుల్స్‌పల్స్ కర్ణాటకలోని మొత్తం 6 రీజియన్లలలో ఐదింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా కోస్తా కర్ణాటకలో మాత్రం బిజెపి ముందంజలో ఉంది.ముంబాయి కర్ణాటకలో కాంగ్రెస్ బిజెపిపై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.
ఓల్డ్ మైసూర్‌లో కాంగ్రెస్ జెడి(ఎస్) పై స్వల్ప ఆధిక్యత కనబరుస్తోంది.బిజెపికి మరొకసారి అవకాశం ఇస్తారా అని అడగ్గా 53 శాతం ఇవ్వమని, 41 శాతం ఇస్తామని, 6 శాతం ఏమీ చెప్పలేమని సమాధానం ఇచ్చారు – పీపుల్స్‌పల్స్‌కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరింది – పీపుల్స్‌పల్స్ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ( Rahu gandhi ) చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొంతవరకు ప్రభావం చూపగలిగింది – పీపుల్స్‌పల్స్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి – పీపుల్స్‌పల్స్ ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది.
కర్ణాటకలో అధికార బిజెపి పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.ముఖ్యంగా పాత పెన్షన్ పథకం అమలుకు ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు – పీపుల్స్ పల్స్‌ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ‘40% సర్కారు’ కమీషన్ నినాదం ద్వారా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల్ని చ్కెతన్యపరచగలిగింది – పీపుల్స్‌పల్స్ అధికార బిజెపి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల బీజేపీకి నష్టం జరిగింది- పీపుల్స్‌పల్స్‌కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ప్రభావంతో ఎస్సీలు కాంగ్రెస్ వైపు నిలిచారు.– పీపుల్స్‌పల్స్ బీజేపీ లేవనెత్తిన జై బజరంగ్‌బలి, టిప్పు సుల్తాన్, ఈద్గా మైదాన్ వంటి … వివాదాస్పద అంశాలు ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయి – పీపుల్స్‌పల్స్ ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేత వల్ల ముస్లింలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు -పీపుల్స్ పల్స్ పీపుల్స్‌పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను రాష్ట్రంలోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టింది.ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపికచేసుకొని, ఒక్కో స్టేషన్లో 15-20 శాంపిల్స్ చొప్పున మొత్తం 3024 శాంపిల్స్‌ను సేకరించింది.