ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రాష్ట్రవ్యాప్తంగా “నిజం గెలవాలి’ యాత్ర( Nijam Gelavali Yatra ) చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ యాత్రలో భాగంగా బుదవారం కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించడం జరిగింది.
“ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ” అంశంపై మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ.కుప్పంలో.
ఈసారి చంద్రబాబుకి( Chandrababu ) రెస్ట్ ఇద్దాం.నేనే పోటీ చేస్తా…నాకు ఎంతమంది మద్దతుగా నిలబడతారు అంటూ భువనేశ్వరి కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి జోగి రమేష్( Minister Jogi Ramesh ) స్పందించారు.
కుప్పం( Kuppam ) నుంచి భువనేశ్వరి పోటీ చేస్తానని చెప్పటం వెనకాల చంద్రబాబు ఓటమి తప్పదు అని వ్యాఖ్యానించారు.చంద్రబాబును గెలిపించి కుప్పం ప్రజలు విసిగిపోయారని అందువల్లే ఆమె పోటీ చేస్తానని వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు.
ప్రజల ఆకాంక్షను తెలుసుకున్న ఆమె ఈసారి చంద్రబాబు గెలవరని.అర్ధమయింది.
దీంతో ఈసారి చంద్రబాబుకి విశ్రాంతి ఇవ్వాలంటూ… సరదాగా ఆమె మాట్లాడలేదని.ఆమె మనసులో ఉన్న మాట బయటపెట్టారు అంటూ జోగి రమేష్ సెటైర్లు వేశారు.
35 ఏళ్లు చంద్రబాబు కుప్పనికి ఏమి చేయలేదని.సొంత భార్య భువనేశ్వరియే చెప్పారని పేర్కొన్నారు.175 స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేని అసమర్ధుడు చంద్రబాబు అని జోగి రమేష్ విమర్శించారు.తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతానికి పరిమితం చేశారు అందువల్లే జనసేన, బీజేపీ పార్టీలకు సీట్లను పంచే పనిలో ఉన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దిక్కులేని పరిస్థితిలో ఉందని అందుకే చంద్రబాబును పక్కకు తోసేయాలనేదే భువనేశ్వరి ఆలోచన అంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.