రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.పవన్ భార్య అన్నా లెజినోవా( Anna Lezhneva ) కొన్నిరోజుల క్రితం చిన్నపిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంతో పాటు క్రిస్మస్ కానుకగా కొన్ని వస్తువులను క్రిస్మస్ కానుకగా చిన్నపిల్లలకు అందించడం జరిగింది.
అయితే కొత్త సంవత్సరం సందర్భంగా అన్నా లెజినోవా మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు.నూతన సంవత్సర వేడుకలను ఫ్రెండ్స్ ఫౌండేషన్( Friends Foundation ) అనే స్వచ్చంద సంస్థకు చెందిన కార్యాలయంలో జరుపుకున్నారు.
పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన అన్నా లెజినోవా పిల్లలకు నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు ఐదుగురు బాలికలు స్కూల్ ఫీజు( School Fees ) కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని స్కూల్ ఫీజు కట్టారు.కష్టాల్లో ఉన్న బాలికలను ఆదుకున్న అన్నా లెజినోవా మంచి మనస్సుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ లా( Pawan Kalyan ) అన్నా లెజినోవా మనస్సు కూడా మంచి మనస్సు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గతంలో మీడియాకు దూరంగా ఉన్న అన్నా లెజినోవా ప్రస్తుతం అనాథ పిల్లలకు( Orphan Children ) మేలు జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం గమనార్హం.పవన్ కళ్యాణ్ కూడా గతేడాది కష్టాల్లో ఉన్న కౌలు రైతులను ఆదుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.తన రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని పవన్ కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం ఖర్చు చేయడంపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ రెండు రంగాలలో సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అన్నా లెజినోవా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.