Tholi Prema : మరోసారి థియేటర్స్ లోకి రానున్న తొలిప్రేమ మూవీ.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan klayan ) నటించిన తొలిప్రేమ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.1998లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అప్పట్లోనే ఈ సినిమా ఒకటి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.అంతేకాకుండా భారీగా కలెక్షన్స్ ను సాధించింది.కాగా 1998 జూలై 24 న థియేటర్ లలోకి విడుదల అయ్యింది.ఈ ఏడాది 2023 జులై 24వస్తే ఈ సినిమాకు 25 ఏళ్లు పూర్తి అవుతాయి.

 Pawan Kalyan Movie Tholi Prema Re Release-TeluguStop.com

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu Karunakaran, Keerthi Reddy, Pawan Kalyan, Tholi Prema, Tollywood-Movie

ఈ నెల 30వ తేదీన తొలిప్రేమ సినిమాను మరొకసారి థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.దాంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా తొలిప్రేమ( Tholi prema ) సినిమా విషయానికి వస్తే.

ఇందులో పవన్ కళ్యాణ్,కీర్తి రెడ్డి( Keerthi Reddy ) కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు డైరెక్టర్ కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు.ఇది ఆయనకు తొలి సినిమా.కొత్త దర్శకుడికి సినిమా అవకాశాలు ఇవ్వటంలో ముందుండే పవన్‌ కరుణాకరన్‌ లోని టాలెంట్‌ను గుర్తించి అప్పట్లో అవకాశం ఇచ్చారు.

Telugu Karunakaran, Keerthi Reddy, Pawan Kalyan, Tholi Prema, Tollywood-Movie

ఈ సినిమాతో కరుణాకరన్‌ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, భవదీయుడు భగత్‌సింగ్‌, ఓ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.తన కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసి వచ్చే ఎలక్షన్స్ లో ఎలా అయినా పాల్గొనాలి అని చూస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఈ క్రమంలోనే ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube