Tholi Prema : మరోసారి థియేటర్స్ లోకి రానున్న తొలిప్రేమ మూవీ.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Klayan ) నటించిన తొలిప్రేమ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

1998లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అప్పట్లోనే ఈ సినిమా ఒకటి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.అంతేకాకుండా భారీగా కలెక్షన్స్ ను సాధించింది.

కాగా 1998 జూలై 24 న థియేటర్ లలోకి విడుదల అయ్యింది.ఈ ఏడాది 2023 జులై 24వస్తే ఈ సినిమాకు 25 ఏళ్లు పూర్తి అవుతాయి.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

"""/" / ఈ నెల 30వ తేదీన తొలిప్రేమ సినిమాను మరొకసారి థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.

దాంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా తొలిప్రేమ( Tholi Prema ) సినిమా విషయానికి వస్తే.

ఇందులో పవన్ కళ్యాణ్,కీర్తి రెడ్డి( Keerthi Reddy ) కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు డైరెక్టర్ కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు.ఇది ఆయనకు తొలి సినిమా.

కొత్త దర్శకుడికి సినిమా అవకాశాలు ఇవ్వటంలో ముందుండే పవన్‌ కరుణాకరన్‌ లోని టాలెంట్‌ను గుర్తించి అప్పట్లో అవకాశం ఇచ్చారు.

"""/" / ఈ సినిమాతో కరుణాకరన్‌ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, భవదీయుడు భగత్‌సింగ్‌, ఓ తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.తన కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసి వచ్చే ఎలక్షన్స్ లో ఎలా అయినా పాల్గొనాలి అని చూస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఈ క్రమంలోనే ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?