కుమార్తెలు అడిగారని ప్రపంచంలోనే అత్యంత విలువైన విల్లాని కొని పారేసాడు!

ఆడపిల్లలు భారం అనుకుంటున్న ఈరోజుల్లో అలాంటి ఆడపిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏం చేయగలరు? ఇక్కడ ఆడపిల్ల పుట్టడంతోనే వారికి పెళ్ళిచేయడమెలా అని బెంగ పెట్టుకొనే తల్లిదండ్రులు మన చుట్టూ చాలామందే వున్నారు.ఇలాంటి సమాజంలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త తమ ఇద్దరు కుమార్తెల కోసం ఏకంగా ఓ రాజభవంతి లాంటి భవనాన్ని కొనుగోలు చేసారు.

 Pankaj Oswal Bought Most Valuable Villa In The World For His Daughters , Pan-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా వున్నా, మీరు విన్నది నిజం.తాజాగా ఆయన కొన్న ఖరీదైన విల్లా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విల్లా అని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే అత్యంత భారీ ధరను చెల్లించి మరీ దానిని సొంతం చేసుకున్నారు మరి.

Telugu Abhay Kumar, Daughters, Valuable Villa, Pankaj Oswal, Latest-Telugu NRI

కొనడమే కాకుండా దాన్ని పూర్తిగా రీడిజైన్ చేయించటం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ అతనెవరంటే భారత సంతతికి చెందిన బిలియనీర్ “పంకజ్ ఓస్వాల్( Pankaj Oswal ).” ఆస్ట్రేలియాలో ఉండే ఆయన ఫ్యామిలీ ఆ మధ్యన స్విట్జర్లాండ్ కు మారింది.ప్రపంచంలోనే టాప్ 10 ఖరీదైన విల్లాల్లో ఒకటిగా చెప్పే విల్లాను కొనుగోలు చేసినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ చెప్పుకొచ్చింది.వారు చెబుతున్న వివరాల ప్రకగం ఈ డీల్ విలువ మన రూపాయిల్లో రూ.1649 కోట్లుగా వెల్లడించారు.ఈ విల్లా ఒకప్పుడు గ్రీక్ షిప్పింగ్ బిజినెస్ లో మాంచి పేరున్న అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె క్రిస్టినా ఒనాసిస్ కు చెందింది.

ఆమె నుంచి పంకజ్ ఓస్వాల్, రాధికా దంపతులు ఇపుడు సొంతం చేసుకోవడం విశేషం.దీనికి సంబంధించిన బాధ్యతను ప్రముఖ ఇంటిరీయర్ డిజైనర్ జెఫ్రీ విల్క్స్ కు అప్పగించారు.

Telugu Abhay Kumar, Daughters, Valuable Villa, Pankaj Oswal, Latest-Telugu NRI

ఇకపోతే, పంకజ్ ఓస్వాల్ సంగతికొస్తే.ఆయన భారత్ లోనే పుట్టి పెరిగారు.ప్రముఖ విద్యా సంస్థ మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( Manipal Institute of Technology )లో విద్యాభ్యాసం చేసారు.వీరికి ఇద్దరు కుమార్తెలు.పెద్ద కుమార్తె 24 ఏళ్ల వసుంధర ఓస్వాల్ కాగా.రెండో కుమార్తె 19 ఏళ్ల రిది ఓస్వాల్.

పెద్ద కుమార్తె ఒక సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.రెండో కుమార్తె లండన్ లో కెమికల్ ఇంజినీరింగ్ చదువుని కొనసాగిస్తున్నారు.పంకజ్ ఓస్వాల్, అగ్రో మిల్స్ అండ్ ఓస్వాల్ గ్రీన్ టెక్ స్థాపించిన బిజినెస్ మాగ్నెట్ అభయ్ కుమార్ ఓస్వాల్ ( Abhay Kumar )కుమారుడు.2016లో ఆయన మరణించగా.ఆయన వ్యాపారాల్ని పంకజ్ చూసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube