13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు.. బాధలు చెప్పుకుంటూ నటి కన్నీరు మున్నీరు!

ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న షోలలో పాండ్యా స్టోర్ కూడా ఒకటి.ఈ షోలో రిషితా ద్వివేది పాండ్యా పాత్రను నటి సిమ్రాన్‌ బుధారుప్‌ పోషించింది.

 Pandya Store Actress Simran Budharup Gets Rape Threats Because Role, Serial Actr-TeluguStop.com

అయితే ఈ పాత్ర కారణంగా ఆమెకు నిజ జీవితంలో కొన్ని బెదిరింపు ఘటనలు జరిగాయట.అలా జీవితంలో తనకు ఎదురైన బెదిరింపు సంఘటనల గురించి తెలిపింది సిమ్రాన్‌.

సోషల్‌ మీడియా ద్వారా తనని అత్యచారం, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చింది.

అయితే ఆ బెదిరింపులు మరింత ఎక్కువ అవ్వడంతో వాటిని తట్టుకోలేక చివరికీ వారిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సిమ్రాన్.

ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది సిమ్రాన్‌ బుధారుప్‌.పాండ్యా సోర్ట్‌ షోలో లీడ్‌ రోల్స్‌ అయిన రవి, దేవ్‌ మధ్య సంబంధాన్ని విడగొట్టే పాత్ర తనదని, అయితే ఇది చూసిన ప్రేక్షకులు తనని దుర్బాషలాడడం మొదలు పెట్టారని,యువకులు అలాగే బాలికల సమూహం సోషల్ మీడియాలో ఆమెను అత్యచారం, చావు అంటూ బెదిరించారు అని చెప్పకొచ్చింది సిమ్రాన్.

Telugu Bollywood, Role, Serial Actress-Movie

13,14 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలు చదువు కోసమని వారి తల్లిదండ్రులు ఫోన్ లు ఇవ్వగా ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేశారని, అప్పుడు వారికి ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలియదని అందుకే వారు ఇలా చేశారు అని తెలిపింది.పరిస్థితులు దిగజారడంతో తప్పలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను.పిల్లలు మంచి, చెడుల మధ్య తేడాను అర్థం చేసుకోలేరు.కాబట్టి వారిని ఎప్పుడూ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి అని తెలిపింది సిమ్రాన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube