TNR భార్య గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు

ప్రముఖ సినీ జర్నలిస్ట్ నటుడు టీఎన్ఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన ఇంటర్వూస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

 Unknown Facts About Journalist Tnr Wife Tnr-TeluguStop.com

ఇక ఇటీవల టీఎన్ఆర్ కరోనాతో మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్‌ఆర్‌కు ఇటీవలె కరోనా సోకింది.

ఇక మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

టీఎన్‌ఆర్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు కొందరు టీఎన్‌ఆర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను అతడి భార్య జ్యోతికి అందజేశారు.

అనంతరం ఆమెతో చిరంజీవి మాట్లాడి పరామర్శించారు.ఇక నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది.

డైరెక్టర్‌ మారుతి టీఎన్‌ఆర్‌ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.తన వంతు సాయంగా 50 వేల రూపాయ‌లను అందించారు.ఈ మేరకు టీఎన్‌ఆర్‌ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్‌కు నగదును పంపించారు.అదే విధంగా ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేయాల్సిందిగా మారుతి సూచించారు.

Telugu Chirenjeevi, Financial, Journalist Tnr, Maruthi, Prime Show, Sampurnesh B

టీఎన్ఆర్ భార్య జ్యోతి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు.ఇంట్లో అందరి భాద్యత తీసుకోని తన అక్కకు, చెల్లికి పెళ్లి చేసింది.అనంతరం ఆమె తన గురించి అలోచించి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.ఇక తన భర్తతో సంతోషంగా గడుపుతున్న సమయంలో టీఎన్ఆర్ మృతి చెందడంతో ఆమెకు మళ్ళి రాకూడని కష్టం వచ్చింది.

ఇక టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు సినీ నటులు, జర్నలిస్టు ముందుకు వచ్చి వారికీ తోచిన సహాయం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube