బిగ్ బాస్ ఎంట్రీపై హర్ష సాయి క్లారిటీ.. అభిమానులు ఫుల్ హ్యాపీ?

హర్ష సాయి.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Pan India Youtuber Harsha Sai Clarification On Bigg Boss 6 Telugu Entry, Harsha-TeluguStop.com

ప్రస్తుతం యూట్యూబ్ లో , ఫేస్ బుక్ లో సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ హర్ష సాయి పేరు మార్మోగిపోతోంది.రియల్ లైఫ్ శ్రీమంతుడు గా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ ద్వారా హర్ష సాయి కి 4.99 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లు.ఇక పోతే చాలా మంది ప్రస్తుతం యూట్యూబ్ లో డబ్బులు కోసం వీడియోలు చేస్తుంటే హర్ష సాయి మాత్రం ఏ వీడియో చేసినా అందులో ప్రజలకు సేవ చేయడమే ప్రధాన అంశం.

అందుకు తగ్గట్టుగానే అతను వీడియోలు చేస్తున్నాడు.సాయం అంటే ఏదో వందో వెయ్యో కాదు.అవసరాన్ని బట్టి లక్షల్లో సాయం చేస్తుంటాడు హర్ష సాయి.అలాగే పేదవాళ్లు ఊహించని రీతిలో సాయం చేసి దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షసాయి.

ఇప్పటికే వందల మంది ఫ్యామీలీస్‌కి సాయం చేసిన హర్ష సాయి త్వరలో మరో 1 మిలియిన్ అనగా పది లక్షలు రూపాయల డబ్బుని పేదలకు దానం చేయబోతున్నట్టు తెలిపారు.ఆ డబ్బుతో వంద మంది పేద ఇళ్లకు సాయం చేయబోతున్నట్టు తెలిపాడు హర్ష సాయి.

ఎవరికైనా తన సాయం కావాలనిపిస్తే 09502600756 నెంబర్‌కి కాల్ చేయొచ్చని తన నెంబర్‌ని అందులో ఉంచాడు హర్షసాయి.ఇది ఇలా ఉంటే హర్ష సాయి త్వరలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ రాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 లోగో లాంచ్ ప్రోమో విడుదల కాగా.ఇందులో హర్ష సాయి గురించే చర్చ నడిచింది.

Telugu Bigg Boss, Harsha Sai, Youtuberharsha-Movie

అన్న కోసం వెయిటింగ్ అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెట్టగా.హర్ష సాయి ఇలాంటి చిల్లర షోలకు రాడు.దయచేసి బిగ్ బాస్ షోకి మాత్రం రావొద్దన్నా.నీ స్థాయిని దిగజార్చుకోకు అంటూ అతని ఫ్యాన్స్ మొరపెట్టుకున్నారు.

మొత్తానికి ఈ వార్త వైరల్ కావడంతో.దీనిపై యూట్యూబర్ హర్ష సాయి స్పందిస్తూ.

బిగ్ బాస్‌కి వచ్చే ఛాన్సే లేదు.నాకు నా ఫ్రీడమ్ ఇంపార్టెంట్.

నాకు నచ్చినట్టు నేను ఉంటా.ప్రతిక్షణం నాకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి.

నా యూట్యూబ్ వీడియోలు కూడా.టైంకి పెట్టాలి అన్నట్టుగా కాకుండా నాకు నచ్చినప్పుడు మాత్రమే చేస్తాను అని చెప్పుకొచ్చాడు హర్ష సాయి.

మొత్తానికి బిగ్ బాస్‌కి వచ్చేది లేదని హర్ష సాయి క్లారిటీ ఇవ్వడంతో మంచి నిర్ణయం తీసుకున్నావ్ అన్నా అంటూ అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube