బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 పై గత సీజన్లతో పోల్చి చూస్తే అంచనాలు పెరగగా ఈ సీజన్ ఆ అంచనాలను అందుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిందనే సంగతి తెలిసిందే.ఈ సీజన్ విన్నర్ ఎవరనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తుండగా బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ విషయంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ కానుండగా వచ్చే వారం మిడ్ వీక్ లో యావర్ లేదా అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.టాప్1 కంటెస్టెంట్ గా పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) టాప్2, టాప్3 లలో శివాజీ లేదా అమర్ దీప్ టాప్4 లో ప్రియాంక ఉండే ఛాన్స్ అయితే ఉంది.హోస్ట్ గా నాగార్జున( Nagarjuna )కు సైతం ఈ షో మంచి పేరును తెచ్చిపెట్టింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ షో ఎంతగానో మెప్పిస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిస్తే మాత్రం అది చరిత్ర అవుతుందని చెప్పవచ్చు.రైతుబిడ్డగా బిగ్ బాస్ షోకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తించిన తీరు సైతం అతనికి ప్లస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.