ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్.. జక్కన్న మూవీ వాళ్లకు అంతగా నచ్చేసిందా?

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.దాదాపుగా 500 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.

 Oscar Award For Ntr Ram Charan Rrr Movie Details Here Ntr , Ram Charan, Alia-TeluguStop.com

నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి.

హాలీవుడ్ డైరెక్టర్లు బాహుబలి2 సినిమా కంటే ఆర్ఆర్ఆర్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.

ఈ సినిమాకు ఆస్కార్ ఇవ్వాలని పలువురు సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ప్రశంసలను అందుకున్న మరో తెలుగు సినిమా లేదనే చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ నాలుగు గంటల నిడివి ఉన్నా చూసేవాళ్లమని ఈ సినిమా అద్భుతమైన సినిమా అని హాలీవుడ్ సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు.

Telugu Alia Bhatt, Hollywood, Oscar Award, Rajamouli, Ram Charan, Rrr-Movie

ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయలేకపోయినా ప్రశంసల విషయంలో మాత్రం ఈ సినిమా బాహుబలి2 సినిమాను బీట్ చేయడం గమనార్హం.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథతో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించినా ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.ఓటీటీలో విడుదలైనా ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జక్కన్నకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం దక్కిందని బోగట్టా.చరణ్, ఎన్టీఆర్ లకు 50 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ అందగా నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం అందుతోంది.

చరణ్, ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకునిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube