ఒక్క చిన్న పొరపాటే నెదర్లాండ్స్ ఓటమికి కారణం.. అదొక్కటీ జరిగివుంటే..!

తాజాగా వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్( Australia-Netherlands ) మధ్య జరిగిన మ్యాచ్లో భారీ పరుగుల తేడాతో పసికూన నెదర్లాండ్స్ ఓడిన సంగతి తెలిసిందే.మ్యాచ్లో చిన్న చిన్న తప్పిదాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసిందే అనడానికి ఈ మ్యాచ్ నిదర్శనం.

 One Small Mistake Was The Reason For The Defeat Of The Netherlands If Only That-TeluguStop.com

నెదర్లాండ్స్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఆస్ట్రేలియా జట్టు భారీ పరుగులు చేసింది.మ్యాచ్ ఆరంభంలో డేవిడ్ వార్నర్( David Warner ) ను రన్ అవుట్ చేసే అవకాశం వచ్చింది.

నెదర్లాండ్స్ ఫీల్డర్లు ఆ అవకాశం ఉపయోగించుకోవడంలో విఫలం కావడం వల్లే డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు.

Telugu Colin Ackerman, David, Steve Smith-Sports News క్రీడలు

నెదర్లాండ్స్ ప్లేయర్ కోలిన్ ఆకర్మన్( Colin Ackerman ) 17వ ఓవర్ బౌలింగ్ వేశాడు.అతను వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా పంపించి వార్నర్ వేగంగా సింగిల్ కోసం వచ్చాడు.ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ పరుగు చేయకుండానే మధ్యలో వెనుతిరిగాడు.

ఎందుకంటే అప్పటికే బంతిని ఫీల్డర్ చేతికి వెళ్ళింది.దీంతో స్టీవ్ స్మిత్( Steve Smith ), డేవిడ్ వార్నర్ ఇద్దరు కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపే పరుగు తీశారు.

ఆ బంతిని అడ్డుకున్న ఫీల్డర్ మ్యాక్స్ ఓ దౌద్ ఆ బంతిని కీపర్ కు అందించడంలో కాస్త తడబడి ఆలస్యం చేశాడు.ఈ సమయంలో డేవిడ్ వార్నర్ వేగంగా క్రీజు దాటేశాడు.

ఆ సమయం వార్నర్ ను అవుట్ చేయడానికి మంచి అవకాశం.అప్పుడు వార్నర్ స్కోరు కేవలం 32 పరుగులే.

Telugu Colin Ackerman, David, Steve Smith-Sports News క్రీడలు

నెదర్లాండ్స్ చేతికి వచ్చిన ఆ అవకాశం చేజార్చుకోవడం వల్ల డేవిడ్ వార్నర్ 104 పరుగులు చేశాడు.ఒకవేళ వార్నర్ రన్ అవుట్ అయి ఉంటే ఆస్ట్రేలియా జట్టు ఇంత భారీ స్కోర్ చేయగలిగేది కాదని క్రికెట్ నిపుణుల అభిప్రాయం.ఆస్ట్రేలియా జట్టు చేతిలో నెదర్లాండ్స్ ఘోర ఓటమికి ఆ రన్ అవుట్ కారణం అని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube