మ‌రోసారి పోలీసుల‌ను బురిడీ కొట్టించిన టిక్‌టాక్ స్టార్‌..

ఈ మ‌ధ్య పోలీసుల‌ను బురిడీ కొట్టిస్తున్న విష‌యాల‌ను ఎన్నో చూస్తున్నాం.చాలామంది కావాల‌ని ఏదో ఒక కంప్ల‌యింటు ఇవ్వ‌డం అయితే చివ‌ర‌కు అది ఫేక్ అని తేలడం లాంటివి జ‌రుగుతున్నాయి.

 Once Again, The Tiktok Toe Star Who Beat The Police Police, Tiktok Star,latest N-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా త‌మిళనాడులోని తిరుచ్చి జిల్లా లో జ‌రిగిన ఘ‌ట‌న సేమ్ ఇలాగే ఉంది.అయితే ఇది చేసింది కూడా టిక్ టాక్ స్టార్ గా మంచి గుర్తింపు పొంది ఓ మ‌హిళ‌.

అయితే ఆమె అంద‌రికీ తెలిసిన టిక్ టాక‌ర్ సూర్యాదేవి.ఈమె గ‌తంలో తీసిన టిక్ టాక్ వీడియోలు ఆ రాష్ట్రంలో విప‌రీతంగా వైరల్ అయ్యాయి.

కాగా ఆమెకు గ‌తంలో కూడా ఇదే విధంగా పోలీసుల‌ను ఆట ప‌ట్టించింది.తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నాట‌కం ఆడి ఓ వీడియో తీసి ఏకంగా దాన్ని కాస్తా పోలీసులకు పంపించింది.

అయితే ఇది చూసిన పోలీసులు హైరానా ప‌డిపోయారు.కానీ అస‌లు విష‌యం ఏంటంటే ఆమె పోలీసుల‌ను బురిడీ కొట్టించింది.

ఎందుకంటే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోకుండా త‌న ఇంట్లో హాయిగా నిద్రపోయింది.ఇంకేముంది ఈ విషయం కాస్తా పోలీసులు చాలా ప్ర‌య‌త్నాలు చేసిన త‌ర్వాత తెలియ‌డంతో వారు ఆమె మీద ఫుల్ సీరియస్ అయ్యారు.

Telugu Tik Tok, Netizens, Tiktok-Latest News - Telugu

అయితే సూర్యాదేవి గ‌తంలో చేసిన కొన్ని ప‌నుల వ‌ల్ల కొంద‌రు న‌ష్ట‌పోగా వారంతా కూడా ఆమె మీద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.ఈ క్ర‌మంలోనే సూర్యాదేవిని ఓ కేసు విష‌యంలో విచారించేందుకు ముధురై పోలీసులు ఆమెను ప‌లు మార్లు పిలిపించారు.అయితే దీంతో ఆమె పోలీసుల‌పై కోపం పెంచుకుని ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు డ్రామా ఆడింది.ఇక పోలీసులు టెన్ష‌న్ ప‌డి అర్థరాత్రి సూర్యాదేవి ఇంటికి వెళ్లి చూడ‌గా ఆమె త‌న ఇంట్లోనే నిద్ర‌పోతోంది.

దీంతో పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకెప్పుడు ఇలాంటి ప‌నులు చేయొద్ద‌ని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube