ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై ఓ లుక్కేయండి!

కొవిడ్‌ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగింది.మరో వైపు పెరిగిన పెట్రోల్‌ ధరలు.

 Ola New Electric Scooter Will Be Soon Launched In The Market , Ola , Elecric Sco-TeluguStop.com

అందరి దృష్టి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వైపు మళ్లేలా చేశాయి.ప్రతిరోజూ ఏదో ఓ ఎలక్ట్రిక్‌ వాహనం మార్కెట్‌లో రిలీజ్‌ అవుతూనే ఉంది.

ఈ సందర్భంగా ప్రముఖ ఓలా టాక్సీ సంస్థ కూడా ఓ కొత్త మోడల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతుంది.ఈ నయా స్కూటర్‌కు సంబంధించిన వీడియోటను ఓలా కంపెనీ సహ వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్‌ విడుదల చేశారు.

ఇది మొదటి ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.అతి త్వరలోనే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు టీజర్‌లో పేర్కొన్నారు.స్కూటర్‌కు సంబంధించిన పలు ఫీచర్లను కూడా వీడియోలో తెలియజేశారు.ఈ బైక్‌ గంటకు 0–60 కీమీ వేగాన్ని అతి తక్కువ సమయంలోనే చేరుకుంటుంది.కాగా,ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర సుమారు లక్ష రూపాయలు ఉండే అవకాశం ఉంది.

ఈ ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఒకసారి ఛార్జీ చేస్తే సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.దీనిలో బ్యాటరీ మార్చుకునేందుకు వీలుగా లిథియం అయాన్‌ బ్యాటరీ చేర్చనున్నారు.

స్కూటర్‌ సీట్‌ కింది భాగంలో రెండు హెల్మెట్లు పట్టేంత ప్లేస్‌ ఉంటుంది.ఈ స్కూటర్‌ ఛార్జ్‌ కోసం ఎటువంటి ఇన్‌స్టాలేషన్‌ అవసరం లేదు.

రెగ్యులర్‌ వాల్‌ సాకెట్‌లోకి ప్లగ్‌ చేయడం ద్వారా వినియోగదారులు వాహనాన్ని సులభంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు.రానున్న రోజుల్లో మరిన్ని ఈ స్కూటర్ల తయారీకి ఓలా సంస్థ తమిళనాడులో ఓ ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతోంది.

Telugu Km, Km Per, Elecric Scooter, Speed, Ola Bike, Olaelectric, Tamilanadu-Lat

సంవత్సరానికి కోటి స్కూటర్లను తయారు చేసేలా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నారు.దీంతో రెండు సెకన్లకు ఒక స్కూటర్‌ తయారీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు హైపవర్‌ ఛార్జర్‌ నెట్‌వర్క్‌ని కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓలా ప్రకటించింది.దీనికోసం హై స్పీడ్‌ ఛార్జింగ్‌ ఆప్షన్లతో ఛార్జర్లు కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ స్కూటర్‌రో ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన దిగ్గజ ఈ స్కూటర్లకు ఇది గట్టి పోటీని ఇస్తుందా? లేదా? మార్కెట్లోకి రిలీజ్‌ అయ్యాక.దాని పనితీరు, వినియోగదారులు రెస్పండ్‌ను బట్టి తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube