తెలంగాణ హైకోర్టులో కేసులు సత్వరంగా పరిష్కరించబడక పెండింగ్ పడుతున్న విషయం తెలిసిందే.ఎందుకని ప్రశ్నిస్తే కేసుల సంఖ్యకు ఇక్కడున్న న్యాయమూర్తుల సంఖ్యకు పొంతన లేకపోవడం వల్ల జాప్యం జరుగుతుందనే ఆరోపణలు కూడా వచ్చాయి.
అంతే కాకుండా తెలంగాణ హైకోర్టు నుంచి రెండేళ్లుగా న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి.
కాగా ఈ విషయంలో స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల రెండు రోజులపాటు వివిధ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చివరికి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 75 శాతానికి పెంచుతు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం వల్ల టీఎస్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరగనుందని సమాచారం.ఇక ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇదే రకమైన విజ్ఞప్తులు వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి కూడా వస్తున్నాయట.
ఈ క్రమంలో జస్టిస్ రమణ వాటిని కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.