నేటి తరం స్టార్ హీరోలలో బిగ్గెస్ట్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.ప్రతీ జనరేషన్ కి ఒక మాస్ హీరో ఉంటాడు, అలా నేటి జనరేషన్ కి ఎన్టీఆర్ అన్నమాట.
అందుకే ఆయన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తుంటాయి.ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతీ విషయాన్నీ ఒక పండుగ లాగ జరుపుకునే అభిమానులు, నేడు ‘అదుర్స్’( Adurs ) రీ రిలీజ్ విషయం లో మాత్రం ఎందుకో వెనుకబడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో అదుర్స్ చిత్రం నెంబర్ 1 స్థానం లో ఉంటుంది.చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరు అమితంగా ఇష్టపడే సినిమా ఇది.ఒక విధంగా ఎన్టీఆర్ కెరీర్ ని అదుర్స్ కి ముందు, అదుర్స్ కి తర్వాత అని విభజించవచ్చు.

ఆ స్థాయి చిత్రమిది, అలాంటి సినిమా రీ రిలీజ్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి?, బాక్స్ ఆఫీస్ మోతెక్కిపోవాలి కదూ?, కానీ అది జరగలేదు.ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా అదుర్స్ నిలిచింది.విచిత్రం ఏమిటంటే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ( Vijayawada, Vizag, Hyderabad )మరియు నైజం వంటి ప్రాంతాలలో ఆడియన్స్ లేక షోస్ మొత్తాన్ని క్యాన్సిల్ చెయ్యడం అందరినీ షాక్ కి గురి చేసింది.
ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మరియు వైజాగ్ వంటి ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ పడుతాయి స్టార్ హీరోల సినిమాలకు.కానీ అదుర్స్ కి ఫుల్స్ పడకపోవడం ఆశ్చర్యార్ధకం.
వీటిని చూసి ట్రేడ్ పండితులు అసలు ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కి ఏమైంది?, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే దానిపై ఆరాలు తీస్తున్నారు.

చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అయ్యినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అసలు పట్టించుకోలేదు.కనీసం కలిసే ప్రయత్నం కూడా చెయ్యలేదు.ఈ సంఘటన తెలుగు దేశం పార్టీ క్యాడర్ ని బాగా హర్ట్ చేసిందని, వాళ్ళు బాయ్ కట్ చెయ్యడం వల్లే అదుర్స్ కి ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ట్రేడ్ పండితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అదుర్స్ చిత్రానికి మొదటి రోజు కేవలం 13 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.ఇది ఎన్టీఆర్ కి అత్యంత అవమానకరమైనది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.