భోళా శంకర్ లో నితిన్ కన్ఫర్మ్..!

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో మెహెర్ రమేష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భోళా శంకర్.ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

 Nitin On Board For Megastar Chiranjeevi Bhola Shankar, Nitin, Bhola Shenkar , Ke-TeluguStop.com

సినిమాలో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ గా నటిస్తుంది.సినిమాలో తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది.

ఈ సినిమాలో యువ హీరో నితిన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో కీర్తి సురేష్ కి జోడీగా నితిన్ ని ఫిక్స్ చేశారని టాక్.

అంతకుముందు ఈ పాత్రకు నాగ శౌర్య నటిస్తాడని అన్నారు.కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో నితిన్ వచ్చి చేరాడని తెలుస్తుంది.

నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత నితిన్ వక్కంతం వంశీ సినిమాలో నటిస్తున్నాడు.ఈ గ్యాప్ లో చిరు భోళా శంకర్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

స్వతహాగా మెగా అభిమాని అయిన నితిన్ మెగాస్టార్ సినిమాలో నటించడం పట్ల సంతోషంగా ఉన్నాడని తెలుస్తుంది.తమిళ సూపర్ హిట్ మూఈ వేదాళం రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ సినిమా మెగా మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట మెహెర్ రమేష్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube