యంగ్ హీరో నితిన్ నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం.ఇక ఈ సినిమాకు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో నూతన దర్శకుడిగా పరిచయమయ్యాడు.ఇక ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించినది.
ఇక వెన్నెల కిషోర్, మురళి శర్మ, సముద్ర ఖని, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించారు.ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాను శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మించారు.ఈ సినిమా పై భారీ అంచనాలు వెలువడ్డాయి.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతే కాకుండా ఈ సినిమా నితిన్ కు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.
కథ:
ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్రలో నటించాడు.రాజకీయ పరిణామాల చుట్టూ తిరిగే ఈ కథలో దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు గుంటూరుకు జిల్లా కలెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడు.అయితే అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎలక్షన్స్ జరగకపోవడంతో ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి పరిస్థితులు గమనించి వాటిని చక్క దిద్దించి ఎన్నికలు జరిపిస్తాడు.
ఇక ఆ సమయంలో జిల్లా కలెక్టర్ గా ఉన్న నితిన్ ఎదుర్కునే సమస్యలు.అంతేకాకుండా అక్కడ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతాడు.ఇక ఆయనకు కృతి శెట్టితో పరిచయం ఎలా ఏర్పడుతుంది.ఆమె ఎవరు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నితిన్ కలెక్టర్ పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.ఎప్పుడూ లవర్ బాయ్ గా కనిపించే నితిన్ ఈ సినిమాతో రాజకీయం చుట్టూ తిరుగుతూ మరింత డిఫరెంట్ పాత్రతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ఆయన సరసన నటించిన కృతి శెట్టి కూడా తన పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది.తన అందాలతో మతి పోగొట్టింది.ఇక వెన్నెల కిషోర్, మురళి శర్మ, రాజేంద్రప్రసాద్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడమే మంచి కామెడీ తో ఆకట్టుకున్నారు.
టెక్నికల్:
ఈ సినిమాకు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి కొత్త డైరెక్టర్ గా పరిచయమైన కూడా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా సినిమాను అద్భుతంగా చూపించాడు.ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది.మహతి స్వర సాగర్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంది.
విశ్లేషణ:
డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు.ఎక్కడ ఏ పాయింట్ ను ల్యాగ్ చేయకుండా చూపించాడు.
ప్రస్తుతం జరిగే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూపించాడు డైరెక్టర్.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, కామెడీ.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
లవ్ కాన్సెప్ట్ లతో లవర్ బాయ్ గా కనిపించే నితిన్ జిల్లా కలెక్టర్ గా కనిపించి బాగా ఆకట్టుకున్నాడు.రాజకీయపరంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.