మాటలు రావడం లేదు... రెండు దశాబ్దాల సినీ కెరియర్ పై నితిన్ ఎమోషనల్ పోస్ట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు నితిన్.మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నితిన్ అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Nithin Emotional Post On Two Decades Of Cine Career, Nithin, Tollywood, Emotiona-TeluguStop.com

ఈయన సినీ కెరీర్లో హిట్ అండ్ ఫ్లాప్ లు అధికంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో విపరీతంగా ఆదరణ పొందిన హీరో నితిన్ అని చెప్పాలి.ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా నితిన్ ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ… 20 సంవత్సరాల క్రితం జయం సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించాను.ఇప్పుడు ఏం చెప్పాలో మాటలు కూడా రావడం లేదు.

నన్ను నమ్మి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ గారికి కృతజ్ఞతలు.అదేవిధంగా నా రెండు దశాబ్దాల కాలంలో నాతో పాటు పనిచేసిన దర్శకనిర్మాతలు ఇతర నటీనటులు టెక్నీషియన్లకు,ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి నన్ను ఆదరిస్తూ నాపై ఇంత ప్రేమకురిపిస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Telugu Bhishma, Kantam Vamsi, Nithin, Telugu, Tollywood-Movie

ఇకపోతే భీష్మ సినిమా ఎంతో మంచి హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయగా మాచర్ల నియోజకవర్గం అనే మరో సినిమాని కూడా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాయి.ఈ సినిమాలపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube