యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.కనీసం పాతిక కోట్లు కూడా ఖర్చు అవ్వని కార్తికేయ 2 సినిమా ఏకంగా వంద కోట్ల కు పైగా వసూళ్లను దక్కించుకుంది.
నిఖిల్ కెరీర్ లోనే గొప్ప విజయం గా ఈ సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు.కేవలం నిఖిల్ కు మాత్రమే కాకుండా ఆ సినిమా కు దర్శకత్వం వహించిన చందు మొండేటికి కూడా ఈ విజయం కెరీర్ లోనే ఒక అద్భుతం అనడంలో సందేహం లేదు.
ఇక నిర్మాణ సంస్థ కి కూడా ఇది ఒక గొప్ప విజయం.వారు పెట్టిన పెట్టుబడికి పలు రెట్ల లాభాలు వస్తున్నాయి.
దాంతో సినిమా కోసం పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే సినిమా కు హైదరాబాద్ లో భారీ సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఇటీవలే సినిమా వంద కోట్ల వసూళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా వంద కోట్ల వేడుక ను హైదరాబాద్ లో వైభవంగా నిర్వహించారు.ఇప్పుడు కర్నూలు లో థాంక్యూ మీట్ ను పెద్ద ఎత్తున నిర్వహించారు.
మొత్తానికి సినిమా విజయానందంలో యూనిట్ సభ్యులు తేలి పోతున్నారు.సినిమా కు ఇలాంటి వేడుకలు చేస్తూ ఉంటే వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి.
తాజగా విడుదల అయిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.దాంతో కార్తికేయ 2 సినిమా యొక్క కలెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి.
అదుగో ఇదుగో అంటూ భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.కార్తికేయ 2 సినిమా కు సంబంధించిన వంద కోట్ల వసూళ్ల లెక్కల విషయంలో కాస్త గందరగోళం ఉన్నా కూడా కేవలం హిందీ వర్షన్ 20 కోట్ల కు పైగా వసూళ్లు సాధించింది అంటూ యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తున్నారు.
లాంగ్ రన్ లో కార్తికేయ 2 సినిమా అక్కడ పాతిక కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం గా అర్థం అవుతోంది.