Damini : నా ఒళ్ళు నా ఇష్టం… మీకేంట్రా భాద… ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన దామిని?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ దామిని( Damini ) ఒకరు.ఇలా తెలుగు ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Netizens Trolls On Singer Damini-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా సింగర్ దామిని కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటారు అనుకున్నటువంటి ఈమె అనుకొని విధంగా మూడవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఇలా మూడవ వారం ఎలిమినేట్ అయినటువంటి దామిని తిరిగి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లే అవకాశం వచ్చింది అయితే వీరిని ఎంపిక చేసే అవకాశం హౌస్ మేట్స్ కి ఇచ్చారు.అయితే ఈమెకు ఎక్కువగా ఓట్స్ వచ్చినప్పటికీ ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో తక్కువ ఓట్లు వచ్చినవారికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతూ షాక్ ఇచ్చారు.

ఈ విధంగా ఈమె వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా కోల్పోయారు.అయితే మూడు వారాల పాటు హౌస్ లో కొనసాగినటువంటి దామిని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

Telugu Bigg Boss, Damini Bhatla, Glamor Show, Damini, Tollywood, Trolls-Movie

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఈమె నాకు తెలుగు బూతు పదాలు నచ్చవు అంటూనే ఇంగ్లీషులో బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు ఈ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు.ఇకపోతే దామిని సోషల్ మీడియా కనుక మనం చూస్తే ఈమె పెద్ద ఎత్తున పొట్టి దుస్తులను ధరిస్తూ గ్లామర్ షో చేస్తూ ఉంటారు.ఇలా తరచూ పొట్టి దుస్తులు ధరించి ఎక్స్పోజ్ చేయడం పట్ల భారీగానే ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటున్నారు.

Telugu Bigg Boss, Damini Bhatla, Glamor Show, Damini, Tollywood, Trolls-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు నేటిజన్స్ నుంచి కొన్ని రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే యాంకర్ నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు మీ సమాధానాలు ఏంటి అంటూ వారు అడిగిన ప్రశ్నలను ఈమెను ప్రశ్నించారు.మూడు వారాలు పాటు హౌస్ లో కొనసాగిన మీకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ వచ్చింది అంటూ కొంతమంది ప్రశ్నించినట్లు యాంకర్ అడగగా ఈ విషయానికి మాత్రం ఈమె సమాధానం చెప్పలేదు.ఇది నేను చెప్పకూడదు చాలామంది వారికి ఇష్టం వచ్చిన నెంబర్ వేస్తూ నేను అంత రెమ్యునరేషన్ తీసుకున్నాను అంటున్నారు కానీ ఈ విషయమైతే నేను బయటకు చెప్పకూడదని దామిని వెల్లడించారు.

Telugu Bigg Boss, Damini Bhatla, Glamor Show, Damini, Tollywood, Trolls-Movie

ఇకపోతే మరొక నేటిజన్ మీరు ఎక్కువగా పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తుంటారు అంటూ కూడా ఈమెను ప్రశ్నించడంతో ఈ ప్రశ్నకు ఈమె వన్ వర్డ్ సమాధానం చెప్పేశారు.ఈ ప్రశ్నకు ఈమె ఎక్కువగా సాగదీయకుండా నా ఒళ్లు .నా బట్టలు నా ఇష్టం అంటూ సింపుల్ గా సమాధానం చెప్పారు.ఇలా తన గురించి ఎవరు ఎన్ని రకాల ట్రోల్స్ చేసిన తనకు సంబంధం లేదని తనకు నచ్చిన విధంగానే తాను నడుచుకుంటానని ఈ సందర్భంగా ఈమె చెప్పకనే చెప్పేశారు.

నేను పొట్టి దుస్తులు ధరించిన నన్ను ట్రోల్ చేస్తారు.అలాగే నేను ఏ విధంగా ఉన్నా నన్ను ట్రోల్ చేయడం ఆపరు అందుకే నాకు నచ్చిన విధంగానే నేను ఉంటాను అంటూ ఈ సందర్భంగా దామిని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube