Paul van Meekeren: క్రికెట్ ఆడితేనే అన్నం లేదంటే పస్తులు ఉండాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను ఎక్కువగా ఆదరించే దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది.ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో కూడా క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది.

 Netherlands Cricketer Paul Van Meekeren Shocking Comments Viral Details, Paul Va-TeluguStop.com

ప్రస్తుత సమాజంలో క్రికెట్ ఆడే ఆటగాళ్లు మంచి సంపాదన సంపాదించుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ బిజీగా ఉన్నారు.ఐసీసీ లాంటి మేజర్ టోర్నీలు తప్ప వారికి పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండదు.

ఇలాంటి మేజర్‌ టోర్నీల్లో క్వాలిఫయింగ్‌ అయితే నెదర్లాండ్స్‌,స్కాట్లాండ్‌, నమీబియా, యూఏఈ లాంటి దేశాల్లో క్రికెట్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు.ఇలాంటి చిన్న దేశాలలో క్రికెట్ ఆడడానికి కొంతమంది మాత్రమే ముందుకి వచ్చిన వారికి సరైన సౌకర్యాలు ఉండవు.

ఏలాంటి సౌకర్యాలు లేకుండా ఆడే ఆటగాళ్ల వారి జీవితాలలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు.

నెదర్లాండ్స్‌ చెందిన ఆటగాడు పాల్‌ వాన్‌ మీకెరెన్‌ ఈ ఆటగాడి పేరు ఎవరికీ పెద్దగా పరిచయం లేకపోయినా టీమ్ ఇండియాతో ఆడిన మ్యాచ్ లో ఈ బౌలర్ మన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ ను తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ బౌలర్ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట.క్రికెట్‌ను అమితంగా ప్రేమించే పాల్‌ వాన్‌ మీకెరెన్‌ ఆట ఆడితేనే డబ్బులు,లేదంటే పస్తులు ఉండాల్సిందే.

Telugu Cricketerpaul, Icc Cup, India, Kl Rahul, Netherland, Cup-Sports News క�

కరోనా వల్ల మ్యాచ్‌లు లేకపోవడంతో పాల్‌ కుటుంబం రోడ్డుపై పడింది.ఒక పూట తినడానికి కష్టంగా మారడంతో క్రికెట్ ను వదిలి ఆటో డ్రైవర్ గా కూడా మారాడు.అయితే కోవిడ్ తగ్గిన తర్వాత కౌంటీ క్రికెట్లో మెరిసిన తను కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన తొలి డచ్‌ క్రికెటర్‌గా పాల్‌ వాన్‌ మీకెరెన్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు.టి20 ప్రపంచకప్‌ లో నెదర్లాండ్స్‌ సూపర్‌-12 చేరడంలో మీకెరెన్‌ కీలకపాత్ర పోషించాడు.క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన పాల్‌ వాన్‌ మీకెరెన్‌ భారత్‌తో మ్యాచ్‌ ఆడడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు.టీమిండియాతో మ్యాచ్‌ ఓడిపోయినప్పటికి కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ తీసిన పాల్‌ వాన్‌ ఆనందంగా ఉందని చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube