తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకోస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.తెలంగాణలో ఆయన చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ విద్వేషానికి వ్యతిరేకంగానే జోడో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమన్నారు.
ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తున్నారని ఆరోపించారు.ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ కొంతమంది వ్యాపారవేత్తలకే లాభం చేకూరుస్తున్నాయని విమర్శించారు.కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అన్ని రాష్ట్రాలను కవర్ చేయాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.వీలైనన్ని రాష్ట్రాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకున్నామని వెల్లడించారు.







