Navdeep : అమ్మాయి క్వాలిటీస్ చెప్పలేను అంటూ పెళ్లి పై షాకింగ్ కామెంట్లు చేసిన నవదీప్..!!

ఒకప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి( Goutham SSC ) , మొదటి సినిమా, జై,చందమామ,ఓ మై ఫ్రెండ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు నవదీప్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు అలాగే కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్నారు.అయితే హీరోగా ఉండి ఉన్నట్టుండి అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు నవదీప్.

 Navdeep Made Shocking Comments On Marriage-TeluguStop.com

అలా ఆర్య 2( Aarya 2 ) , నేనే రాజు నేనే మంత్రి, బాద్ షా,ధ్రువ వంటి సినిమాల్లో చేశారు.అయితే అలాంటి నవదీప్ ఈ మధ్యకాలంలో కేసులో పట్టుబడ్డ సంగతి మనకు తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే 40 ఏళ్ల వయసుకు దగ్గర పడుతున్న కూడా నవదీప్ ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు.

Telugu Aarya, Chandamama, Druva, Goutham Ssc, Jai, Marraige, Modati, Navdeep, Ne

అయితే పెళ్లి గురించి తాజాగా తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టారు.నవదీప్ ( Navdeep ) మాట్లాడుతూ.నేను ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను.

అలాంటప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం వేస్ట్.అలాగే నాకే పెళ్లి చేసుకోవాలని లేనప్పుడు అమ్మాయి గురించి క్వాలిటీస్ చెప్పడం ఎందుకు.

అలాగే నా గురించి నాకే తెలియదు అలాంటప్పుడు మరొకరిని తీసుకొచ్చి చంకలో పెట్టుకోవడం ఎందుకు.అంటూ నవదీప్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Aarya, Chandamama, Druva, Goutham Ssc, Jai, Marraige, Modati, Navdeep, Ne

అలాగే పెళ్లి బంధం గురించి నవదీప్ మాట్లాడుతూ.వివాహ వ్యవస్థలో లోపం లేదు.దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది.పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు చేసుకుంటున్నామని చేసుకునే వారిలో ఒక క్లారిటీ ఉండాలి.అలాగే పెళ్లి బంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాలి.అలాంటప్పుడే ఆ వివాహ బంధం ఎక్కువరోజులు నిలబడుతుంది.

ఇక ప్రస్తుతం నేనైతే పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను అంటూ నవదీప్ ( Navdeep ) వివాహ వ్యవస్థ పై అలాగే పెళ్లిపై తనకి ఉన్న అభిప్రాయాన్ని బయట పెట్టారు.ఇక నవదీప్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube