నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతకు ముందు శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా నాని నుండి వచ్చింది.
ఈ రెండు సినిమా లకు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.కాని వసూళ్ల విషయం లో మాత్రం చాలా నిరాశ తప్పడం లేదు.
నాని ఇప్పటి వరకు చేసిన సినిమా ల్లో చాలా వరకు మంచి టాక్ నే దక్కించుకున్నాయి.కాని వసూళ్ల విషయంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా ల వెనుక ఏమైనా కుట్ర జరుగుతుందేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా అంటే సుందరానికి సినిమా గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
అయినా కూడా థియేటర్లలో ఈ సినిమా ఆడుతున్నది చాలా తక్కువే.
కారణం టికెట్ల రేట్లను భారీగా పెంచడంతో పాటు చాలా తక్కువ థియేటర్లలో సినిమా ను విడుదల చేశారు.
వసూళ్ల విషయంలో అంటే సుందరానికి చిత్రానికి చాలా నష్టం జరిగింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అమెరికాలో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది.కేవలం ఆరు రోజుల్లోనే అక్కడ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఈ వీకెండ్ కు మరో మూడు లక్షల డాలర్ల వరకు వసూళ్లు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కనుక ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయి లో వసూళ్లు రాబట్టాల్సి ఉంది.కాని ఇక్కడ తెర వెనుక ఏదో జరుగుతున్న నేపథ్యం లో నాని సినిమా వసూళ్ల విషయం లో నిరాశ పర్చుతున్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అందుకే నాని వెనుక ఏదో జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలు అయ్యింది.