నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా అంటే సుందరానికీ.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 28 కోట్ల బిజినెస్ తో రిలీజైంది.అయితే ఫస్ట్ డే సినిమా ఓ మోస్తారు కలక్షన్స్ రాబట్టగా సెకండ్, థర్డ్ వీకెండ్స్ మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది.
నాని అంటే సుందరానికీ సినిమా ఫస్ట్ డే ఏపీ, తెలంగాణా కలిసి 4 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 15.08 కోట్ల షేర్ రాబట్టింది.ఫ్యామిలీఎ ఎంటర్టైనర్ గా వచ్చిన అంటే సుందరానికీ సినిమా రన్ టైం కొద్దిగా ఎక్కువైందన్నటాక్ వచ్చింది.
అయితే చిత్రయూనిట్ ముందే ఈ సినిమాని 3 గంటల్లో చెప్పాలనే ఉద్దేశంతో సినిమా రిలీజ్ చేశారు.అదే సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడేలా చేసింది.సినిమా రన్ టైం వల్ల కొద్దిగా బోర్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది.నాని అంటే సుందరానికీ సూపర్ హిట్ అనిపించుకోవాలంటే మరో 13 కోట్లను రాబట్టాలి.
ఆ తర్వాత వచ్చిన కలక్షన్స్ అన్ని లాభాలే అని చెప్పొచ్చు.