ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్ వాలా, సెక్యూరిటీ గార్డ్ కూతుళ్లు.. గ్రేట్ అనేలా?

చైనాలో ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు( Asian Games ) జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి( Jyoti Yarraji ) రజత పతకం సాధించారు.

 Nandini Agasara Jyothi Yarraji Success Stories Details, Jyothi Yarraji, Agasara-TeluguStop.com

హర్డిల్స్ పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్ జ్యోతి కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.ఫాల్స్ స్టార్ట్ వివాదం తర్వాత జ్యోతికి రజత పతకాన్ని ప్రకటించడం జరిగింది.

జ్యోతి యర్రాజిది పేద కుటుంబం కాగా ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు.

అమ్మ కుమారి గృహిణిగా పని చేస్తోంది.100 మీటర్ల హార్డిల్స్ లో భారత ఆణిముత్యంగా ఆమె పేరు తెచ్చుకున్నారు.గతేడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జ్యోతి ఏకంగా 9 సార్లు జాతీయ రికార్డ్ ను అందుకున్నారు.

ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంకల్ప బలాన్ని ఆయుధంగా మలచుకుని ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ జ్యోతి సత్తా చాటుతున్నారు.ఒలింపిక్స్ లో కూడా గెలవాలనేది తన కలగా పెట్టుకున్నారు.

Telugu Meters Hurdles, Asian Games, Athletics, Jyothi Yarraji, Nandini Agasara,

రిలయన్స్ ఫౌండేషన్( Reliance Foundation ) సపోర్ట్ ఉండటం ఆమెకు ప్లస్ అయింది.మరోవైపు తెలంగాణకు చెందిన అగసర నందిని( Agasara Nandini ) ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.అథ్లెటిక్స్ విభాగంలో ఆమె కాంస్యం నెగ్గారు.సంగారెడ్డిలోని రెసిడెన్షియల్ కాలేజ్ లో ఆమె డిగ్రీ చదువుతున్నారు.నందిని తండ్రి ఎల్లయ్య ఛాయ్ వాలా అని తెలుస్తోంది.

Telugu Meters Hurdles, Asian Games, Athletics, Jyothi Yarraji, Nandini Agasara,

ఆసియా క్రీడల్లో సత్తా చాటిన చాయ్ వాలా,( Tea Seller ) సెక్యూరిటీ గార్డ్( Security Guard ) కూతుళ్ల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.ఆసియా క్రీడల్లో భారత షూటర్లు కూడా సత్తా చాటుతున్నారని తెలుస్తోంది.ఆసియా క్రీడల్లో భారత్ కు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతుండటం ఎంతోమందికి సంతోషాన్ని కలిగిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మాత్రం క్రీడాకారులు మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube