టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అయ్యింది.అయినా కూడా ఇంకా సినిమా గురించిన చర్చ లు తారా స్థాయి లో జరుగుతున్నాయి.
సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటంతో అప్పుడే భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు.జక్కన్న సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అద్బుతమైన విజువల్ వండర్ అన్నట్లుగా ఆర్ ఆర్ ఆర్ ను చూపించడం కోసం రాజమౌళి ఎన్ని మాయలు చేశాడో.ఎంతగా కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.
హీరోలతో కూడా చాలా కష్టపడేలా చేసి ఉంటాడు.
అలాంటి జక్కన్న భారీ ఎత్తున ఈ సినిమా ను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు.
సినిమా విడుదల తర్వాత వీఎఫ్ఎక్స్ కు సంబంధించిన షాట్స్ కొన్ని మీడియా ముందుకు వస్తున్నాయి.వాటిని చూస్తే కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి.ముఖ్యంగా ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ను అభిమానుల కోసం రివీల్ చేశారు.కాని అదే అభిమానులు ఇప్పుడు ఆ ఫోటోలపై మరియు వీడియోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
![Telugu Rajamouli, Nandamuri Fans, Ntr Fans, Ntr Rrr Scene, Ram Charan, Rrr Graph Telugu Rajamouli, Nandamuri Fans, Ntr Fans, Ntr Rrr Scene, Ram Charan, Rrr Graph](https://telugustop.com/wp-content/uploads/2022/06/Nandamuri-fans-fire-on-RRR-movie-makers-detailsa.jpg)
ఎన్టీఆర్ ను తక్కువ చేసే ఉద్దేశ్యంతోనే మీరు ఇలా చేస్తున్నారు.గ్రాఫిక్స్ వర్క్ ను రివీల్ చేస్తే సినిమా పై ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా.అలాగే హీరోల పై ఏమైనా గౌరవం ఉంటుందా అంటూ కొందరు అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.రామ్ చరణ్ ఫోటో లు వీడియో లు ఎందుకు విడుదల చేయడం లేదు.
మీరు ఎన్టీఆర్ కే ఎందుకు ఇంతగా మోసం చేస్తున్నారంటూ నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అభిమానులకు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు కాస్త గ్యాప్ ఎక్కువ అవుతోంది.
ఎన్టీఆర్ స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.