ఈటివీలో ప్రతి గురవారం, శుక్రవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రతి ఒక్కరు చూసే ప్రోగ్రాం జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు షోస్ కూడా చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి.సినిమాలో అవకాశలకోసం వెతికే వారికీ ఇది చక్కటి ఫ్లాట్ ఫాం ఎంతో మంది నటులు ఈ ప్రోగ్రాం నుండి సినిమాల్లో రానిస్తున్నారు.
ఈ రెండు షోస్ కి కూడా న్యాయ నిర్ణేతలుగా నాగబాబు మరియు రోజా వ్యవహరిస్తున్నారు.జబర్దస్త్ ప్రారంభం అయ్యి ఇప్పటికి ఎడున్నరా సంవత్సరాలు అప్పటినుండి కూడా నాగబాబు ప్రోగ్రాం డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేశాడు.
ఆ విషయం మనం చూసే ప్రతి ఎపిసోడ్స్ లోను కనిపిస్తుంది.అలాగే అంతే సక్సెస్ ఫుల్ గా జబర్దస్త్ వెనక నుండి శ్యాంప్రసాద్ రెడ్డి నడిపించాడు.ఈ మద్య కాలంలో నాగబాబు జబర్దస్త్ నుండి విడిచిపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.నాగబాబు, జనసేన పార్టీలో చేరినప్పటినుండి ఈ వార్తలు వస్తున్నాయి, కానీ నాగబాబు మాత్రం షోస్ కు వస్తున్నే ఉన్నారు.
ఈ మద్య కాలంలో మరోసారి ఇలాంటి వార్తలు వస్తున్నాయి.నాగబాబుకు జబర్దస్త్ నుండి తక్కువ రెమ్యునరేషన్ వస్తుందని అందుకే విడిచి వెల్లుతున్నాడని అంటున్నారు.దానికి మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
నేను సినిమాలు తీసి అప్పుల్లో ఉన్న సమయంలో నన్ను జబర్దస్తు ఆదుకుంది.నాకు ఉన్న కామెడీ సెన్స్ చూసి మరి శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, కానీ నేను జబర్దస్త్ ను ఇలా మద్యలో విడిచి వెల్లుతానని కూడా అనుకోలేదు.కానీ కొన్ని అనివార్య కారణాలవలన వేల్లవలిసి వస్తుంది.
అవి ఎలాంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు నేను ఏమిచేప్పలేను.త్వరలోనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని అన్నారు.
నూటికి నూరు శాతం రెమ్యునరేషన్ విషయం మాత్రం కాదు అన్నారు.