కిరణ్ వస్తే జగన్ కు లాభమా నష్టమా ?

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

కొత్త అధ్యక్షుడి ఎంపిక తొందరగా పూర్తి చేసి ఏపీలో బాగా బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది.

ఏపీ తెలంగాణ విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.ముఖ్యంగా ఏపీలో నామరూపాల్లేకుండా అయిపొయింది.

అసలు ఇప్పట్లో పార్టీ పుంజుకుంటుంది అనే నమ్మకం కూడా జనాలకు లేదు.అయితే ఈ నిస్తేజం నుంచి పార్టీ శ్రేణులను బయటపడేలా చేసి నూతన ఉత్సాహం తీసుకురావాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరమీదకుతీసుకొస్తోంది.ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిరణ్ తనదైన శైలిలో పరిపాలన చేశారు.

Advertisement

ఆయనకు జనంలో పెద్దగా గుర్తింపు లేకపోయినా ఆయన అప్పట్లో ప్రవేశపెట్టిన పథకాలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి.కిరణ్ హయాంలో రచ్చబండ ద్వారా రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం, తొమ్మిది రకాలైన నిత్యావసర సరకులు పంపిణీ చేయడం ఇప్పటికీ ప్రజలు మరచిపోరు.

కరడు కట్టిన సమైక్యవాదిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ నుఎదుర్కొన్న తీరుకు ప్రజలు బాగా మద్దతు పలికారు.ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ తెలంగాణను విడదీయడం దీనిని నిరసిస్తూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టడం, ఆ తరువాత ఆ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం వరుస వరుసగా జరిగిపోయాయి.

అయితే ఈ ఎన్నికల ముందు మళ్ళీ కిరణ్ ను కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళారు.ఆయనకు రాహుల్ గాంధి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విభజన తరువాత బీజేపీలో చేరుతారని వూహాగాలను విపించాయి.అయితే ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అయితే ఎన్నికల వేళ ఏపీలో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కి ఆయన ప్రచారం కూడా చేయలేదు.

Advertisement

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని, టిడిపి కాంగ్రెస్ గుర్తు పెట్టుకుంటా యని కిరణ్ భావించారు.కానీ అలా జరగకపోవడంతో కిరణ్ నిరాశకు గురయ్యారు.ఇక అప్పటి నుంచి కిరణ్ పెద్దగా అయితే ఇప్పుడు ఆయనకు ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉండడంతో ఆయన ఏ విధంగా స్పందిస్తారో అనేది ఇంకా తెలియడంలేదు.

ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ తన పార్టీ ఖాతాలో వేయించుకున్నారు.ముఖ్యంగా రాయలసీమను జగన్ పూర్తిగా తుడిచిపెట్టేశారు.

రెడ్డి సామాజికవర్గం అంతా జగన్ వెనుక నిలబడుతున్నారు.ఈ నేపధ్యంలో రెడ్డిల పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ కి మళ్ళీ ఆ ఓట్లు, బలం రావాలంటే సీమ ప్రాంతానికి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని భావిస్తున్నారట.

ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగానే ఉన్నా ముందు ముందు ఆ పార్టీకి వడిదుడుకులు ఖాయం అని అప్పుడు తప్పనిసరిగా కొంతమంది అయినా కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఉపయోగపడతారని కాంగ్రెస్ భావిస్తోంది.

తాజా వార్తలు