కొంతమందికి ఏదోఒకటి తినాలనే కోరిక విపరీతంగా ఉంటుంది.దాంతో జంక్ ఫుడ్స్ ఎక్కువగా లాగించేస్తూ ఉంటారు.
ఆలా తినటం వలన లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది.సాధారణంగా భోజనం చేసిన రెండు గంటలకు ఆకలి వేస్తుంది.
కానీ అస్తమానం ఏదో ఒకటి తినాలనే కోరిక ఉన్నవారు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఏదో తినాలనే కోరిక తగ్గుతుంది.ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
నట్స్నట్స్ లో ఫైబర్ అధికంగా ఉండుట వలన ఆకలిని నియంత్రిచే హార్మోన్స్ మీద పనిచేసి ఆకలిని నియంత్రిస్తాయి.
రొయ్యలురొయ్యలలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
బరువు తగ్గాలన్నా, ఆకలి నియంత్రణలో ఉంచటానికి బాగా సహాయపడతాయి.
అరటిపండురెండు అరటిపండ్లు తింటే చాలు ఆకలి ఎగిరిపోయి తక్షణమే ఎనర్జీ వస్తుంది.
కడుపు నిండిన భావన కలుగుతుంది.అయితే రెండు కంటే ఎక్కువ అరటిపండ్లను తింటే మాత్రం శరీరంలో కొవ్వు చేరటం ఖాయం.

వెజిటేబుల్స్ఆకుకూరలు, క్యారెట్స్ , క్యాబేజి , బ్రొక్కోలి వంటివి తినవచ్చు.కడుపు నింపటమే కాక, ఇవి ఆకలిని నియంత్రిస్తాయి.వీటిని ఎక్కువగా తీసుకున్న ఏమి కాదు.
ఆపిల్ఆపిల్ తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది.అంతేకాక బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.చూసారుగా ఈ ఆహారాలను తీసుకోని ఆకలిని నియంత్రించుకోండి.