విరాట్ కోహ్లీ బర్త్ డే కోసం ముస్తాబైన ఈడెన్ గార్డెన్స్..!

భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) బర్త్ డే నవంబర్ 5 అనే విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే.కోహ్లీ బర్త్ డే రోజే భారత్- సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనుంది.

 Mustabaina Eden Gardens For Virat Kohlis Birthday , Virat Kohli , Snehasish Ga-TeluguStop.com

ఈ మ్యాచ్ నిర్వహించే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కోహ్లీ బర్త్ డే కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ప్రత్యేకంగా ఓ భారీ కేక్ కూడా క్యాబ్ ఏర్పాటు చేస్తోంది.

ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు 70 వేల కోహ్లీ మాస్కులు కూడా క్యాబ్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే లైట్ షో కూడా కోహ్లీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Eden Gardens, Odi Cup, Africa, India, Virat Kohli, Virat Kohlis-Sports Ne

క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహశిష్ గంగూలీ( Snehasish Ganguly ) మాట్లాడుతూ.కోహ్లీ కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద కేక్ ఆర్డర్ చేశామని.కోహ్లీని చూడగానే అందరికీ గుర్తొచ్చే విషయంలా దాన్ని డిజైన్ చేశామని తెలిపాడు.మ్యాచ్ మిడ్ ఇన్నింగ్స్ ఇంటర్వెల్ లో ఫైర్ వర్క్స్ షో ఉంటుంది.కోహ్లీ బర్త్ డే ను తాము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.కోల్ కత్తా ప్రేక్షకులు అందరూ దీనిలో భాగస్వాములే అని స్నేహశిష్ గంగూలీ తెలిపాడు.

Telugu Eden Gardens, Odi Cup, Africa, India, Virat Kohli, Virat Kohlis-Sports Ne

విరాట్ కోహ్లీ కు ఈ వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.వరల్డ్ కప్ ఆరంభం నుంచి కోహ్లీ చాలా బాగా రాణిస్తున్నాడు.పాకిస్తాన్, ఇంగ్లాండ్ లతో జరిగిన మ్యాచ్లు తప్ప మిగతా మ్యాచ్లలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా జట్టుపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ తో అదరగొట్టాడు.న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

నవంబర్ ఐదు న భారత్- సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించడం కోసం కచ్చితంగా స్టేడియం నిండిపోతుందని, మైదానం మొత్తం విరాట్ కోహ్లీ అభిమానులే అయి ఉంటారని, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు క్యాబ్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube