అవును నిజం హైదరాబాద్‌లో తల్లిపాలు కొనొచ్చు ఒక్క బాటిల్‌ ధర ఎంతంటే ?

బిజీ నగర జీవితం వల్ల కావచ్చు.మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల వల్ల కావచ్చు.

 Mother Milk Sell In Hyderabad-TeluguStop.com

పెరిగిపోతున్న సిజేరియన్‌ ఆపరేషన్ల వల్ల కావచ్చు.కొందరు పిల్లలకు తల్లిపాలు తాగే అదృష్టం దక్కడం లేదు.

కళ్లు తెరిచిన మరుక్షణం నుంచే వీళ్లు డబ్బా పాలకు అలవాటు పడుతున్నారు.నిజానికి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఆ తల్లి కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధిత జబ్బుల నుంచి బయట పడే వీలుంటుంది.

Telugu Delhi Hyderabad, Hyderabad, Mothermilk, Bow-

అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా చిన్నారులకు పాలు ఇవ్వలేకపోతున్నారు.అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు మార్కెట్‌లో తల్లిపాలు కూడా దొరుకుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన ఈ మిల్క్‌ బ్యాంక్‌.హైదరాబాద్‌లోనూ క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి.పాలు ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్న తల్లులు తమ బిడ్డకు సరిపోను మిగిలి ఉంటే వాటిని ఈ బ్యాంకులకు దానం చేస్తున్నారు.

Telugu Delhi Hyderabad, Hyderabad, Mothermilk, Bow-

ఆ పాలను ప్రాసెస్‌ చేసి, స్టోర్‌ చేసి అవసరమైన బిడ్డలకు ఆయా హాస్పిటల్స్‌ అందిస్తున్నాయి.తొలిసారి నిలోఫర్‌ ఆసుపత్రిలో ఈ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభం కాగా.ఫెర్నాండెజ్‌, రెయిన్‌బోలాంటి ఆసుపత్రులు కూడా వీటిని ప్రారంభించాయి.

ఒక తల్లి నుంచి పాలను దానంగా పొందడానికి ముందే ఆమెకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సిలాంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

ఈ పాలను దానంగా పొందినా.

వాటిని ప్రాసెస్‌ చేసి స్టోర్‌ చేయడానికి ఆసుపత్రులకు కొంత ఖర్చవుతోంది.దీంతో పాలు అవసరమైన వాళ్లకు ఆ డబ్బు తీసుకొని ఇస్తున్నారు.ఇలా ఒక్కో బాటిల్‌కు రూ.250 వరకూ వసూలు చేస్తున్నారు.డబ్బు పోతే పోయింది కానీ.పురిటి బిడ్డకు ఎంతో అవసరమైన, అన్ని పోషక విలువలు ఉన్న తల్లిపాలు దక్కుతుండటంతో క్రమంగా ఈ మిల్క్‌ బ్యాంక్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube