ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న మోనోవీల్ వెహికల్ వీడియో..!

ఇప్పుడంటే హాయిగా కూర్చుని ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలిగే సౌకర్యవంతమైన ఫ్యామిలీ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్, అడ్వెంచర్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి.కానీ 100 ఏళ్ల క్రితం ఇవేమీ అందుబాటులో ఉండేవి కాదు.

 Monowheel In 1931 Travelling With 93 Mph Video Viral Details, Goventosa, Italian-TeluguStop.com

అయితే ప్రజల జీవితాలను సులభతరం చేయాలని కొత్త వాహనాలను కనిపెట్టడానికి అప్పటి సైంటిస్టులు ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసేవారు.అలాంటి వారిలో M.

గోవెంటోసా( M.Goventosa ) ఒకరు.

ఈ ఇటాలియన్ ఇన్వెంటర్ 1931లో మోనోవీల్‌ వెహికల్( Monowheel Vehicle ) తయారు చేశాడు.ఈ సింగిల్ వీల్ వెహికల్ 93 mph వేగంతో దూసుకుపోయేదట.అంటే గంటకు దాదాపు 150 కిలోమీటర్లు వేగం.దాదాపు 100 ఏళ్ల క్రితమే అంత స్పీడ్ తో వెళ్లే బైక్ తయారు చేయడం అప్పట్లో ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు.

ఇది ఒకే టైరు( One Tyre ) ఉన్న బైక్.దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ అంత స్పీడ్ దానిపై ఎలా వెళ్తారు అనేదే అసలైన ప్రశ్న.

మోనోవీల్ ఎలా రోడ్లపై దూసుకెళ్తుందో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.హిస్టారికల్ విడ్స్ అనే ట్విట్టర్ పేజీ దీనిని షేర్ చేసింది.ఈ వీడియో ప్రకారం, మోనోవీల్‌ వెహికల్ ఒక పెద్ద టైర్‌ని కలిగి ఉంది, రైడర్‌( Rider ) ఆ టైరు మధ్యలో ఏర్పాటు చేసిన ఒక సీట్‌లో కూర్చున్నాడు.అందులో అతడు ఈజీగా పట్టగలిగాడు.

అదే టైర్ కింద ఒక మోటారు, స్టీరింగ్, యాక్సిలరేషన్ ఇచ్చేందుకు కావాల్సిన పరికరాలన్నీ అమర్చాడు.

వాటిని హ్యాండిల్ చేస్తూ దాదాపు 50 స్పీడ్ తో రోడ్డుపై వెళ్ళాడు.అంతేకాదు ఈ బైక్‌ను తనకు నచ్చినట్లు గుండ్రంగా తిప్పేసాడు.ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఇలాంటి ఒక మోనో వీల్ తయారుచేసి ఇప్పటి తరం వారికి కూడా అందుబాటులోకి తేవచ్చు కదా అని మరి కొందరు కోరుతున్నారు.ఈ మోనోవీల్‌ వీడియోకి ఒక కోటి 34 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube