అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఐలుగురు భారతీయ విద్యార్ధులు రోజుల వ్యవధిలో హత్యకు గురికావడం అగ్రరాజ్యంలోనూ, మనదేశంలోనూ కలకలం రేపింది.ఈ పరిణామాలు భారత్‌లో వున్న విద్యార్ధుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
విదేశాలకు పిల్లల్ని పంపాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్ధితి నెలకొంది.గత నెలలో ఐదుగురు భారతీయులు పలు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై భారత విదేశాంగ కార్యాలయం( Indian Foreign Office ) స్పందించింది.అమెరికాలోని ఇండియన్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా వున్నాయని పేర్కొంది.

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్‌గా వున్న రణధీర్ జైస్వాల్ ( Randhir Jaiswal )దీనిపై మాట్లాడుతూ.అమెరికాలోని మన కాన్సులేట్లు బాధితులతో రెగ్యులర్‌గా టచ్‌లో వున్నాయని చెప్పారు.విద్యార్ధుల మరణానికి కారణం ఏమిటనేది దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని జైస్వాల్ పేర్కొన్నారు.విద్యార్ధులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, వారి కోసం తమ రాయబార కార్యాలయం, కాన్సులేట్ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయని ఆయన వెల్లడించారు.
ఐదుగురు విద్యార్ధుల్లో ఇద్దరు భారతీయులు, మిగిలిన ముగ్గురు భారత సంతతికి చెందిన అమెరికా పౌరులని జైస్వాల్ పేర్కొన్నారు.వీరిలో వివేక్ సైనీ హత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేశామని, స్థానిక అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
రెండవ కేసులో (సిన్సినాటి యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్ధి) వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని జైస్వాల్ వెల్లడించారు.

మరోవైపు.వరుసగా ఐదుగురు భారతీయ విద్యార్ధుల( Indian students ) మరణాలపై వైట్‌హౌస్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.అమెరికాలో జాతి, లింగం, మతం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా ఎలాంటి హింసకు తావు లేదని వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలి అధికారి జాన్ కిర్బీ( John Kirby ) గత నెలలో పేర్కొన్నారు.
అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) , ఆయన పరిపాలనా యంత్రాంగం.భారతీయ విద్యార్ధులపై దాడులను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తామని జాన్ కిర్బీ వెల్లడించారు.