తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రకుల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అయితే మొన్నటి వరకు వరుసగా సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా గడిపిన రకుల్ ఇటీవల అవకాశాలు తగ్గడంతో తన ప్రియుడు జాకీ బగ్నానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.
ప్రస్తుతం హనీమూన్ అంటూ విదేశాల్లో తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇటీవలె రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో కలిసి పెళ్లి అయిన తర్వాత మొట్ట మొదటిసారి ఒక డ్యాన్స్ సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన వీడియో వైరల్ ఐయింది.ఇది ఇలా ఉంటే తాజాగా తన భర్త పై ప్రేమను కురిపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.
జాకీలోని సెన్స్ ఆఫ్ హ్యూమరే( Jackie’s sense of humor ) మొదట నన్ను ఆకర్షించింది.తనతో ఉంటే సమయం తెలీదు అంటూ తన భర్త ముచ్చట్లు చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్.
ఇటీవలే అస్సాంలో ఒక కార్యక్రమానికి భర్తతో కలిసి హాజరైంది రకుల్.
ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలో తనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని రకుల్ భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ( Jackie Bhagnani ) చెప్పగా.ఆ పక్కనే ఉన్న రకుల్ అది మాత్రం నిజం.తను నవ్వుతూ, పక్క ఉన్న వారందర్నీ నవ్విస్తాడు.
అందర్నీ సంతోషంగా ఉండేలా చూడటం అతని ప్రత్యేకత.అందుకే ఆయన్ను ఇష్టపడ్డాను.
జాకీ అద్భుతమైన హాస్య చతురత కలిగిన వ్యక్తి.అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి.
అటువంటి మనిషి నా భర్త కావడం నా అదృష్టం అంటూ తన భర్తను పొగడ్తలతో ముంచెత్తింది రకుల్.