Dhanush Kubera : డిఫరెంట్ సినిమాలు చేయాలంటే ధనుష్ రావల్సిందేనా..? మన హీరోలకి అంత దమ్ము లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న అతి కొద్ది మంది దర్శకులలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ఒకరు.ఈయన చేసిన ప్రతి సినిమా చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరిని ఆకట్టుకునే విధంగా ఈయన సినిమాలు ఉంటాయి.

 Dhanush Sekhar Kammula Kubera Movie Intensive First Look-TeluguStop.com

అందువల్లే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది అంటే సినిమా మీద మంచి అంచనాలైతే ఉంటాయి.ఇక దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఆయన ధనుష్( Dhanush ) హీరోగా ‘కుబేర ‘( Kubera ) అనే సినిమాని చేస్తున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నాగార్జున కూడా నటిస్తూ ఉండడం విశేషం…

Telugu Dhanush, Dhanush Kubera, Dhanushsekhar, Kubera, Nagarjuna, Sekhar Kammula

అయితే ఈ సినిమాలో డి గ్లామర్ పాత్ర లో ధనుష్ కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ధనుష్ ఒక సినిమా కోసం ఎలాంటి పాత్రలో అయిన ఇమిడిపోయి నటిస్తాడు.అందువల్లే ఆయనకి నటుడిగా మంచి గుర్తింపు అయితే వస్తుంది.

ఇక ప్రస్తుతం ఆయన తెలుగు మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు.కాబట్టి తెలుగు దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నారు.

ఇంతకుముందు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్ అనే సినిమా( Sir Movie ) చేసి సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటిస్తూ ఈ సినిమాతో మరొక సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

Telugu Dhanush, Dhanush Kubera, Dhanushsekhar, Kubera, Nagarjuna, Sekhar Kammula

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒక సినిమాని చేయాలంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ధనుష్ రావాల్సిందేనా డిఫరెంట్ అటెంప్ట్ లు మన హీరోలు చేయలేరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక సినిమా అనేది యూనివర్సల్ అయిపోయింది.కాబట్టి ఇప్పటికే ఎలాంటి సినిమానైనా సరే ప్రేక్షకుడు చాలా ఈజీగా చూసేస్తున్నాడు.కాబట్టి ఇలాంటి సమయంలో కూడా మన హీరోలు సెక్యూర్ జోన్ లోనే సినిమాలు చేస్తూ ఉంటాం అంటే కుదరదు.

ఎందుకంటే బయట ఇండస్ట్రీలో హీరోలు ఇలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలిగేంత సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నారు.కాబట్టి మనం కూడా ఎవరికి తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే డిఫరెంట్ అటెంప్ట్ లను సైతం అంగీకరిస్తూ ముందుకు సాగాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube