విద్య, నైపుణ్యాభివృద్ధిలో సహకారమే లక్ష్యం.. కొత్తగా ఆవిర్భవించిన ఇండియా-యూఎస్ వర్కింగ్ గ్రూప్‌

మారుతున్న కాల మాన పరిస్ధితులకు అనుగుణంగా విద్యా రంగంలోనూ( Education Sector ) పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు మనదేశంలోనే విద్యార్థులు చదువుకుని ఉద్యోగం సంపాదించేవారు.

 Ministry Of Education Launches India-us Working Group For Cooperation In Educati-TeluguStop.com

కానీ ఇప్పుడు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది.నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా విదేశాల వైపు మన పిల్లలు పరుగులు పెడుతున్నారు.

చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.( America ) నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.

భారతీయులు ఈ విషయంలో ముందున్నారు.కేంద్ర ప్రభుత్వం కృషి, ప్రవాసీ సంఘాల తోడ్పాటు కారణంగా భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Telugu Donald Lu, India, Indian, Ministry, Neeta Prasad, Skill, Usa, Usa Nri-Tel

ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్నత చదువులు చదివేవారికి, ఉద్యోగస్తులకు మరింత అండగా నిలిచేందుకు గాను కేంద్ర విద్యా శాఖ, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లు సంయుక్తంగా ఇండియా-యూఎస్ వర్కింగ్ గ్రూప్‌ను( India-US Working Group ) ప్రారంభించాయి.భారత్, అమెరికాల మధ్య విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని పెంపోందించడమే లక్ష్యంగా ఈ వర్కింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు.ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (విద్యా మంత్రిత్వ శాఖ) జాయింట్ సెక్రటరీ నీతా ప్రసాద్. దక్షిణ , మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో (యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్) సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ ఈ ఇండియా-యుఎస్ వర్కింగ్ గ్రూప్‌‌కు వారి వారి దేశాల నుండి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

Telugu Donald Lu, India, Indian, Ministry, Neeta Prasad, Skill, Usa, Usa Nri-Tel

నైపుణ్యం, విద్య మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇతర సంబంధిత ఏజెన్సీల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడానికి రెండు దేశాలు కృషి చేయనున్నాయి.ఇక.తొలి సమావేశాల్లోనే భారతీయ ప్రతినిధి బృందం కీలక విషయాలను లేవనెత్తింది.వీసా మంజూరు , ధృవపత్రాల తనిఖీ అంశాల్లో జాప్యం గురించి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌తో చర్చించారు.

ప్రధానంగా నైపుణ్యం, వృత్తి విద్య, సర్టిఫికేషన్, గుర్తింపుపై ఈ వర్కింగ్ గ్రూప్ దృష్టి సారించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube