చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో చోటుచేసుకున్న సంఘటనలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడం సంచలనం సృష్టించింది.
దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులపై సీరియస్ అయ్యారు.ఈ పరిణామంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
పరిస్థితి ఇలా ఉండగా మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ తగ్గిపోతుందని.
అన్నారు.
చంద్రబాబు మాదిరిగానే ఆయన కార్యకర్తలు కూడా వ్యవహరిస్తున్నారు.
కుప్పంలో పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు.లాఠీ చార్జ్ కి చంద్రబాబే కారణం.
అని ఆరోపించారు.రాష్ట్రంలో విపక్షాలకు మరియు అధికార పార్టీకి నిబంధనలు ఒకటేనని స్పష్టం చేశారు.
కందుకూరిలో 8 మంది ఆ తర్వాత గుంటూరులో ముగ్గురు చనిపోతే జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఇప్పుడు కుప్పంలో కూడా అదే మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఏది ఏమైనా ఎంతమంది చనిపోయిన అధికారంలోకి రావడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది అంటూ మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.