రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రక్షాళనం చేసే విధంగా వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ టీడీపీ, జనసేన ,బీజేపీ నాయకులు ప్రయత్నిస్తూ ఉండటం, అదే పనిగా వైసిపి నాయకులు పై విమర్శలు చేస్తుండడం వంటి వ్యవహారాలను జగన్ సీరియస్ గా తీసుకున్నారు.
ఈ మేరకు పార్టీలోని కీలక నేతలకు పార్టీ పదవులు కేటాయించి గట్టి కౌంటర్ లు ఇచ్చేందుకు జగన్ డిసైడ్ అయిపోయారు.ఈ మేరకు పార్టీ పదవుల జాబుతాను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
ఏపీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి లో ఉన్న కర్నూలు జిల్లా కీలక నేత యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి యువజన విభాగం అధ్యక్షుడిగా జగన్ నియమించారు.కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సిద్ధార్థ రెడ్డి కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆ పదవిని కట్టబెట్టారు.
నందికొట్కూరు ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో అక్కడ పోటీ చేసేందుకు సిద్ధార్థ రెడ్డి అవకాశం లేకపోవడంతో కీలకమైన నామినేటెడ్ పదవితో పాటు, పార్టీ పదవి జగన్ కేటాయించారు.ఇక వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పోతుల సునీత ను నియమించారు.
ఆమె సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా చీరాల.గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆమె రెండేళ్ల క్రితం వైసీపీలో చేరారు.
ప్రస్తుతం టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తరచుగా వైసిపి ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ విమర్శలు చేస్తున్న క్రమంలో ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైసిపిని రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ప్రత్యేకంగా నలుగురిని నియమించారు.కడప జిల్లా మైదుకూరు కు చెందిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, కమలాపురం కి చెందిన పుత్తా శివ శంకర్, చల్ల మధుసూదన్ రెడ్డి, నంద్యాలకు చెందిన సోమి రెడ్డి గారి మధుసూదన్ రెడ్డి ని నియమించారు.ఇక విద్యార్థి విభాగం కు పానుగంటి చైతన్య, రైతు విభాగం ఎంవీఎస్ నాగిరెడ్డి, బీసీ సెల్ జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్ మచ్చరాస వెంకటలక్ష్మి, మొరజోత్ హనుమంత్ నాయక్, కార్మిక విభాగం కు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి, వాణిజ్య విభాగం వెల్లంపల్లి శ్రీనివాస్, మైనార్టీ సెల్ – ఆఫీస్ ఖాన్, సాంస్కృతిక విభాగం వంగపండు ఉష, క్రిస్టియన్ మైనారిటీ సెల్ – ఫాదర్ బడ్డు బాలస్వామి, వైయస్సాఆర్టీ ఎఫ్ కల్పలత రెడ్డి, ఐటి విభాగం మేడపాటి వెంకట్, సెంట్రల్ ఆఫీస్ ఇంచార్జ్ – లేళ్ల అప్పిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ డాక్టర్ రమణారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు
.