వ్యతిరేకత లేదు రికార్డ్ బద్దలు కొడతాం: కేటీఆర్ !

వచ్చే ఎన్నికలు హొరాహొరిగా మారుతున్నాయి అన్న అంచనాలు నడుమ అసలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకత అన్నదే కనిపించడం లేదు అంటున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ వారసుడు కేటీఆర్( KTR ) .దేవరకొండ ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన కొంతమంది పార్టీలో చేరిన సందర్భంగా వారిని కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన కేటీఆర్ తమ నాయకుడు కేసీఆర్ మరోసారి రికార్డ్ బ్రేక్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, తెలంగాణలో బిఆర్ఎస్ ఏర్పాటుకు ముందు ఫ్లోరోసిస్ మాత్రమే ఉంటే ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తుందని 3400కు పైగా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే అని, రాష్ట్రమంతా తిరుగుతున్న తనకు ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కడా కనిపించలేదని, కెసిఆర్ చేసిన అభివృద్దే కనిపిస్తుందని చెప్పుకొచ్చారు .

 Minister Ktr On Brs Winning In Next Elections,minister Ktr ,cm Kcr,brs,trs,bjp,c-TeluguStop.com
Telugu Brs Manifesto, Cm Kcr, Congress, Janagama, Ktr, Telangana-Politics

తెలంగాణ అభివృద్ధి( Telangana Development ) నమూనాను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే కేసీఆర్( KCR ) మరొకసారి అధికారం లోకి రావాలంటూ ఆయన చెప్పుకొచ్చారు.ప్రతిపక్షాలు చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షాల మాటల్లోనే ఉందని ప్రజల్లో లేదంటూ సంక్రాంతికి కొత్త బిచ్చగాల్లా లా వచ్చే కొంత మంది మాటలను , కొన్ని పార్టీలను నమ్మొద్దు అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.మరోవైపు జనగాం లో జరిగిన బహిరంగ సభ సన్నాహక వేదికలో హరీష్ రావు( Harish Rao ) మాట్లాడుతూ కాంగ్రెస్ ది కేవలం మాటల ప్రభుత్వమని తమది చేతల ప్రభుత్వ మని చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు 15 సార్లు తెలంగాణలో కాంగ్రెస్కు అవకాశం ఇస్తే ఏం చేశారంటూదుయ్యబట్టారు .

Telugu Brs Manifesto, Cm Kcr, Congress, Janagama, Ktr, Telangana-Politics

ఈనెల 15వ తారీఖున జనగామలో జరిగే భారీ బహిరంగ సభలో బిఆర్ఎస్ మేనిఫెస్టో( BRS Manifesto ) ప్రకటిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు .2001 లోనే జనగామ లోని అన్ని మండలాలలోనూ టిఆర్ఎస్ జండా ఎగరేసిన ఘనత ఈ జిల్లాకు దక్కుతుందని.ఇక్కడ కార్యకర్తలకు కాళ్లు కడిగిన నీళ్లు నెత్తిన పోసుకున్నా రుణం తీరదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.కేసీఆర్ పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని అందుకే ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారని మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణను సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube