హోం మంత్రి తో లోకేష్ భేటీ ఫలితం ఉంటుందా?

చాలా కాలంగా హస్తిన లోనే ఉంటున్న లోకేష్ ఏట్టకేలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) తో మీట్ అయ్యారు.రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ పరిస్థితులను అధికార పార్టీ విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును హోంమంత్రికి వివరించినట్టుగా లోకేష్( Nara Lokesh ) చెప్పుకొచ్చారు.

 Nara Lokesh Meeting With Union Home Minister Amit Shah,minister Amit Shah,nara L-TeluguStop.com

ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు విషయంలో ఎటువంటి నిబంధనలు పాటించలేదని గవర్నర్ అనుమతితో సహా చాలా సాంప్రదాయాలకు పాతరేశారని అంతేకాకుండా ఎన్నికల కేంద్రంగా ఉద్దేశపూర్వకంగానే రాజకీయ దాడి చేస్తున్నారని హోంమంత్రికి వివరించినట్లుగా తెలుస్తుంది .అంతేకాకుండా జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో కూడా తమ ఆందోళన పడుతున్నామని ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కనీస సదుపాయాలను కూడా జైల్లో కల్పించడం లేదని హోంమినిస్టర్ కు లోకేష్ నివేదించినట్టుగా తెలుస్తుంది.ఈ భేటీలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తో పాటు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొన్నారు .

Telugu Ap, Chandrababu, Amit Shah, Lokesh, Ycp-Telugu Political News

భేటీ తర్వాత పురందేశ్వరి ట్వీట్( Purandeswari Tweet ) చేస్తూ రాష్ట్రంలో ఉన్న భయానక పరిస్థితులను లోకేష్ హోం మంత్రి అమిత్ షా వివరించారని,చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి ఉందని విమర్శిస్తున్న వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని, బాబు అరెస్టు( Chandrababu Arrest ) వెనక బిజెపి ఉంటే ఇప్పుడు లోకేష్కి ఎందుకు భేటీకి అవకాశం ఇస్తారంటూ ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో అమిత్ షా వివరాలు కనుకున్నారని ఆయన తొందర్లోనే ఈ విషయంపై స్పందిస్తారని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Ap, Chandrababu, Amit Shah, Lokesh, Ycp-Telugu Political News

అయితే ప్రస్తుత ఎన్నికల సమయంలో తెలుగుదేశంపార్టీ( TDP ) తో కంటే వైసీపీ తోనే కేంద్ర పెద్దలకు అవసరాలు ఎక్కువ ఉండటంతో ఈ విషయంలో అమిత్ షా ఏ మేరకు కల్పించుకుంటారు అన్నది కూడా అనుమానంగానే మారింది .ఎన్నికల చివరి దశలో ఉన్నందున బజాపా నాయకత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ రాజకీయ ప్రయోజనాల కేంద్రం గానే ఉంటాయని ప్రస్తుతం తెలుగుదేశం కన్నా వైసీపీ నే నమ్మ దగ్గ మిత్రుడు గా కేంద్రం పరిగణిస్తునందున కేవలం లోకేష్ తో బేటీ ఫార్మాలిటీ గానే జరిగింది తప్ప దీని ద్వారా ఎటువంటి ప్రయోజనం టిడిపి కి ఉండదని వార్తలు వస్తున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube